JEO TO VISIT BOONDI MAKING FACTORY_ బూందీ తయారీ యంత్రం పరిశీలన కోసం నవంబరు 22న చెన్నైకి తిరుమల జెఈవో బృందం

Tirumala, 20 November 2017: A team of TTD senior officials from engineering and potu wings lead by Tirumala JEO Sri KS Sreenivasa Raju will visit Chennai on November 22.

The purpose of the visit is to study the working of boondi making machine in the famous Adayar Sweets Factory at Ambattur.

They will also see the functioning of thermo fluid machine which is helpful to cook rice at high temperatures and its feasibility in Tirumala.
Tiruvetriyur of Tamilnadu also caught the attention of devotees.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

బూందీ తయారీ యంత్రం పరిశీలన కోసం నవంబరు 22న చెన్నైకి తిరుమల జెఈవో బృందం

తిరుమల, 2017 నవంబరు 20: వేగవంతంగా బూందీ తయారుచేసే అత్యాధునిక యంత్రాన్ని పరిశీలించేందుకు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ అధికారుల బృందం నవంబరు 22వ తేదీ బుధవారం చెన్నైకి వెళ్లనుంది.

చెన్నైలోని అంబత్తూరులో గల ప్రఖ్యాత అడయార్‌ స్వీట్‌ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ అత్యాధునిక బూందీ తయారీ యంత్రం పనితీరును పరిశీలిస్తారు. దీంతోపాటు థెర్మోఫ్లూయిడ్‌ పరికరాలను తిరుమలలో వినియోగించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.