FOREIGN CURRENCY OFFERINGS SHOULD BE CONVERTED IMMEDIATELY-EO_ భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీని త్వరితగతిన మార్చుకోవాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 20 November 2017: Necessary initiatives should be taken to account the foreign currencies offered by devotees in Hundi by converting them into Indian currency, directed TTD EO Sri Anil Kumar Singhal.

While reviewing with senior officers in Meeting Hall of TTD Administrative building on Monday, the EO said, this issue should be immediately negotiated with AP Resident Commissioner at New Delhi by concerned authorities. Towards the construction of new Boondi complex in Tirumala, the engineering officials should come up with an action report he added. He also directed that the FMS Call Centre should facilitate the pilgrims to get improvised services.

The EO complimented the performances by various artistes during the ongoing Ammavari Brahmotsavams. He instructed the concerned to engage similar expert artistes even for Tirumala Brahmotsavams next year by negotiating with cultural department of different states. He also appreciated the new PA system procured by R and B department of TTD for the sake of artistes.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, CE Sri Chandrasekhar Redsy, FACAO Sri Balaji and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీని త్వరితగతిన మార్చుకోవాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2017 నవంబరు 20: శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన వివిధ దేశాల కరెన్సీని త్వరితగతిన మార్చుకునేందుకు బ్యాంకు అధికారులతో చర్చించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విదేశీ నాణేల మార్పిడికి సంబంధించి ఢిల్లీలోని ఎపి రెసిడెంట్‌ కమిషనర్‌తో చర్చించాలన్నారు. తిరుమలలో బూందీ తయారీ కోసం కొత్త కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఈ నెలాఖరులోపు కార్యాచరణ నివేదిక సమర్పించాలన్నారు. తిరుమలలో గదుల నిర్వహణ కోసం ఎఫ్‌ఎంఎస్‌ సేవలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా ఎఫ్‌ఎంఎస్‌ కాల్‌సెంటర్‌ను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ పరిసరాలు, పైకప్పు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ముఖ్యమైన పర్వదినాల్లో ఆర్చిలు, ఎల్‌ఇడి స్క్రీన్ల ఏర్పాటుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని సూచించారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలిస్తున్నాయని ఈవో కితాబిచ్చారు. ఇదేవిధంగా, రాబోయే తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు నైపుణ్యం గల కళాకారులను ఆహ్వానించాలన్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోని సాంస్కృతిక శాఖలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాలన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాల్లో కళాబృందాల కోసం ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్పీకర్లను వినియోగించామని, తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లోనూ వీటిని వాడాలని ఈవో ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.