ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 08, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

బ్రహ్మోత్సవాలకు ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

11-02-2018(ఆదివారం) ధ్వజారోహణం(8.07గం||లకు) శేష వాహనం

12-02-2018(సోమవారం) చప్పర ఉత్సవం రావణ వాహనం

13-02-2018(మంగళవారం) చప్పర ఉత్సవం నంది, హంసవాహనం

14-02-2018(బుధవారం) చప్పర ఉత్సవం గజ, సింహవాహనం, కల్యాణోత్సవం

15-02-2018(గురువారం) చప్పర ఉత్సవం ధ్వజావరోహణం

16-02-2018(శుక్రవారం) ——- ఏకాంతసేవ.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.