BRAHMOTSAVAMS OFF TO A COLOURFUL START IN KAPILESWARA SWAMY TEMPLE
ABHISHEKAM PERFORMED TO TEMPLE PILLAR ONLY DURING DHWAJAROHANAM IN A YEAR
Tirupati, 25 February 2019: The annual brahmotsavams in the famous shrine of Lord Sri Kapileswara Swamy off to a religious start on Monday with Dhwajarohanam in the auspicious Kumbha Lagnam at 7.19am.
As a part of this ceremonial flag hoisting event, the Dhwajapatam(holy flag) with the image of Nandi (divine bull) was rendered puja by the Saiva Agama pundits followed by Abhishekam, Bali, Nivedana, Deeparadhana and other rituals. The Abhishekam to Dhwajam (temple pillar) is performed only once in a year during the time of Dhwajarohanam of annual brahmotsavams in the temple.
Speaking on this occasion, TTD EO Sri Anil Kumar Singhal said, the important days includes Nandi Vahanam on March 4 on the auspicious day of Maha Sivarathri, Sri Paravati Parameswara Kalyanam on March 5 and Trisula Snanam on March 6.
He said, elaborate floral, electrical and security arrangements were made in view of the festival in the temple.
CVSO Sri Gopinath Jatti, DyEO Sri Subramanyam, VGO Sri Ashok Kumar Goud, AEO Sri Nagaraju and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ధ్వజారోహణంతో వేడుకగా శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఫిబ్రవరి 25, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.00 గంటల నుండి ధ్వజారోహణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 7.19 గంటలకు కుంభ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీమణిస్వామి, కంకణభట్టర్ శ్రీ ఉదయస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
ఏడాదికోసారి ధ్వజస్తంభానికి విశేష అభిషేకం :
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాల్లో భాగంగా మార్చి 4న శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగనుందని తెలిపారు. మార్చి 5న కల్యాణోత్సవం, మార్చి 6న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నట్టు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు, లైటింగ్‌తో కటౌట్లు ఏర్పాటుచేశామన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృ పకు పాత్రులు కావాలని కోరారు.
అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.