TTD TEAM VISITS ARYA AYURVEDIC CENTRE IN KOTTAKAL, KERALA_ కేరళ లోని ఆర్య ఆయుర్వేద వైద్య శాలను సందర్శించిన టీటీడీ అధికారుల బృందం 

Tirupati,29, May,2023: A team of TTD officials visited the National fame Kottakal ayurvedic research centre, hospital and pharmacy in Kerala.

The team comprising of TTD JEO Smt Sada Bhargavi, CAO Sri Sesha Shailendra and SV Ayurvedic Hospital, Superintendent Dr Renu Dikshit were studying the ayurvedic practices, including  Pancha karma treatment, online and offline services, free and paid services, free rooms and paid rooms etc.

At the Ayurveda research centre, they studied the formulations of Ayurvedic medicines and the medicines in demand and also, discussed over the ₹500 crore annual turnover and marketing strategies of the Kottakal unit.

Thereafter the team called on Dr P M Warrier, managing trustee on all aspects of manufacturing, medical services, research and marketing of products.

They also requested Dr Warrier to send an experts team to TTD hospitals and advise on improvements and examine practices and innovations etc.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కేరళ లోని ఆర్య ఆయుర్వేద వైద్య శాలను సందర్శించిన టీటీడీ అధికారుల బృందం

తిరుపతి 29 మే 2023: దేశంలో ప్రసిద్ధి చెందిన కేరళ రాష్ట్రం కొట్టక్కల్ లోని ఆర్య ఆయుర్వేద వైద్య పరిశోధన కేంద్రం,ఆసుపత్రి, ఫార్మసీ ని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ సోమవారం సందర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా జనం ఇక్కడికి ఆయుర్వేద వైద్య చికిత్స, పంచకర్మ కోసం రావడానికి గల ప్రత్యేకతల గురించి వీరు అధ్యయనం చేశారు.

ఆసుపత్రికి రోగులు ఆన్లైన్ ద్వారా, నేరుగా వచ్చి ఓపీ, ఇన్ పేషేంట్ సేవలు పొందుతున్న విధానం గురించి అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉచిత, ఫీజు వసూలు చేసే కేటగిరీల వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. రోగులు ఏ ప్రాంతం నుండి ఇక్కడికి ఎలా చేరుకుంటున్నారనే సమాచారం తీసుకున్నారు. ఫ్రీ రూములు, పెయిడ్ రూములను, వాటి నిర్వహణ పరిశీలించారు.

ఇక్కడి ఆయుర్వేద పరిశోధన కేంద్రంలో ఏ తరహా మందులు తయారు చేస్తున్నారు. ఏ మందులకు ఎక్కువ డిమాండ్ ఉంది అనే వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడి ఫార్మసీ నుండి ఏటా రూ 500 కోట్ల టర్నోవర్ ఎలా చేయగలుగుతున్నారో చర్చించారు. విదేశాలకు మందులు పంపే మార్కెటింగ్ వ్యవస్థ గురించి పరిశీలించారు. అనంతరం టీటీడీ అధికారుల బృందం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పి ఎం వారియర్ ను కలసి ఆసుపత్రి నిర్వహణ, వైద్యసేవలు, పరిశోధనలు, మార్కెటింగ్ విధానాల గురించి చర్చించారు. టీటీడీ ఆసుపత్రికి ఇక్కడి నుండి ఒక బృందాన్ని పంపాలని కోరారు. ఇందుకు డాక్టర్ వారియర్ సానుకూలంగా స్పందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది