Adhikara Nandi Vahanam _ అధికారనంది వాహనంపై సోమస్కందమూర్తి
అధికారనంది వాహనంపై సోమస్కందమూర్తి తిరుపతి, మార్చి 7, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం సోమస్కందమూర్తి అధికారనంది వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.కపిలేశ్వరస్వామి […]
