భగవంతున్ని సేవించటం సులభం
భగవంతున్ని సేవించటం సులభం తిరుపతి, జనవరి -07, 2011 : సంకీర్తనల ద్వారా భగవంతున్ని సేవించటం సులభమన్న ప్రచారాన్ని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టారు. శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవములు, నిత్యసేవలు, ప్రత్యేక ఉత్సవాలతోపాటు కొత్తగా ప్రారంభించిన నాదనీరాజనం వంటి భక్తి సంగీత ప్రచార కార్యక్రమాల్లో ఈ కళాశాల ప్రథమ భూమిక పోషిస్తున్నది. తద్వారా స్వామివారి వైభవాన్ని ప్రపంచ నలుదిశలా చాటుతున్నది. శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవములలో భాగంగా మూడవ […]
