తిరుచ్చిపై ఊరేగిన శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుచ్చిపై ఊరేగిన శ్రీ పద్మావతి అమ్మవారు – రాత్రి 9:30 గంటలకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం తిరుపతి, 18 నవంబరు 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి 7:30 గంటలకు అమ్మవారు బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడవీధులు విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 9.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించనున్నారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపడంతో బ్రహ్మోత్సవాలు […]
