Rs.15LAKHS DONATION TO SVIMS SCHEME_ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.15 లక్షల విరాళం

Tirumala, 25 Jan 19: Sri CHS Subrahmanyam Raju of Junnuru village, Poduru mandal of West Godavari donated Rs.15lakhs towards Sri Balaji Arogya Vara prasadini Scheme (SVIMS).

They have handed over the DD to TTD Chairman Sri P Sudhakar Yadav outside Sarva Darshanam Complex at Tirumala on Friday.

Speaking to media, the chairman said, SVIMS super specialty hospital is offering state of art medical facilities to the needy and poor. The donations by philanthropists will provide opportunity to treat more number of patients.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.15 లక్షల విరాళం

తిరుమ‌ల‌, 2019 జ‌న‌వ‌రి 25: ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోదురు మండ‌లం జున్నూరు గ్రామంకు చెందిన శ్రీ సిహెచ్ఎస్ సుబ్ర‌మ‌ణ్యం రాజు శుక్ర‌వారం ఉద‌యం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.15 లక్షల విరాళాన్ని అందించారు.

తిరుమ‌ల‌లోని స‌ర్వ‌ద‌ర్శ‌నం కాంప్లెక్స్ వ‌ద్ద టిటిడి ధ‌ర్మ క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాదవ్‌కు ఆయ‌న డిడిని అందజేశారు.

అనంత‌రం టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రిలో వేలాది మంది పేద‌ల‌కు ఉచితంగా వైద్య‌సేవ‌లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. దాత‌లు అందించే విరాళాల‌తో రోగుల‌కు మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తామ‌న్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.