CHAIRMAN INSPECTS NARAYANAGIRI QUEUE LINES_ నారాయణగిరి ఉద్యానవనాలలోని క్యూలైన్లను తనిఖీ చేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టాసుధాకర్‌ యాదవ్‌

Tirumala, 25 May 2018: TTD Chairman Sri Putta Sudhakar Yadav inspects Narayanagiri queue lines in Tirumala on Friday.

Later he interacted with the pilgrims on the various facilities being given by TTD to them including food, buttermilk, beverages, water distribution and different types of darshan.

Pilgrims expressed satisfaction over the food and water facilities provided by TTD. According to Sri Rajratan Singh from Rajasthan, I came from Udaipur along with my family. The food and beverages are provided at regular intervals by the management in spite heavy rush. Thanks to the arrangements”, he told the Chairman.

The Chairman instructed the officials concerned to enhance the amenities in view of the pilgrim rush. “Make regular announcements about time taking for Sarva Darshan and Sarva Darshan Token system for better information of the pilgrims”, he added.

Health Officer Dr Sermista, AVSO Sri Gangaraju and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నారాయణగిరి ఉద్యానవనాలలోని క్యూలైన్లను తనిఖీ చేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టాసుధాకర్‌ యాదవ్‌

తిరుమల, 2018 మే 25: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలలోని దివ్యదర్శనం, సమయ నిర్ధేశిత సర్వదర్శనం క్యూలైన్లను శుక్రవారం ఉదయం టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు పరిశీలించారు.శ్రీవారిసేవకులతో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలు గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్ల పరిసరాలు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సులభంగా అర్థమయ్యేలా వివిద బాషాలలో సూచిక బొర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం లేపాక్షి సర్కిల్‌ నుండి ఏర్పాటు చేసిన సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు సర్వదర్శనం సమయాన్ని, సర్వదర్శనం టోకెన్లు పొందే విధానం గురించి ఎప్పటికప్పుడు టిటిడి రేడియో అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా తెలియచేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆరోగ్య విభాగం అధికారిణి డా|| శర్మిష్ఠ, ఎవిఎస్వో శ్రీ గంగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.