PAC OPENED AT VONTIMITTA_ ఒంటిమిట్టలో యాత్రికుల వసతి సముదాయాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Vontimitta, 25 May 2018: The pilgrims amenities complex opened at Vontimitta in Kadapa district on Friday by TTD Chairman Sri Putta Sudhakar Yadav.

Built by TTD at Rs.4.60crores in a 28,310sq.ft area near Sri Kodanda Rama Swamy temple, the building serves accommodation needs of devotees.

Speaking on this occasion, the TTD Board Chief said, the first floor of the building provides dining facility to over 600 devotees while nealy 100 people can rest in the dormitory hall. In second and third floors, there are 15 rooms with two deluxe rooms. He said for implementation of master plan, suggestions are invited from locals, devotees and public representatives.

Tirupati JEO Sri Pola Bhaskar District collector Sri Hari kiran said, the temple will be developed on the lines of Tirumala along with necessary amenities for visiting Pilgrims in a phased manner.

Chief Whip Sri M Mallikarjuna Reddy, CE Sri Chandrasekhar Reddy, AEO Sri Ramaraju and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్టలో యాత్రికుల వసతి సముదాయాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

తిరుపతి, 2018 మే 25: కడపజిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద టిటిడి నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టాసుధాకర్‌ యాదవ్‌ శుక్రవారం ఉదయం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, కల్యాణ వేదిక, శ్రీ రామాయణం ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలతో సమన్వయం చేసుకొని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ”శ్రీ రామాయణం” ప్రాజెక్టు ద్వారా రామాయణం గురించి భక్తులకు తెలిపేందుకు, ఆధ్యాత్మిక, అహ్లాదకరంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు వివరించారు. ఒంటిమిట్టలో ఎండలు ఎక్కువ కావున ఆలయం, పరిసర ప్రాంతాలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలియచేశారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి రూ.4.6 కోట్లతో 28,310 ఎస్‌.ఎఫ్‌.టితో యాత్రికుల వసతి సమూదాయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇందులోని మొదటి అంతస్తులో 600 మంది భోజనం చేసేందుకు వీలుగా డైనింగ్‌ హాల్‌, 100 మంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఒక పెద్దహాల్‌, రెండు, మూడు అంతస్థులలో 15 రూములు, రెండు డీలక్స్‌ రూములు నిర్మించినట్లు వివరించారు.

అనంతరం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే కల్యాణోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న విషయం విదితమే అన్నారు. కావున స్వామివారి కల్యాణోత్సవానికి గౌ || రాష్ట్ర గవర్నర్‌, గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తలంబ్రాలు సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు.

ఇందుకు సంబంధించి ఒంటిమిట్టలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటెషన్‌ ద్వారా కన్సల్టెంట్‌వారు వివరించినట్లు తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌ అమలుకు సంబంధించి భక్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల నుండి సలహాలు, సూచనలు తీసుకుని అవసరమైన మార్పులు చేసి నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు.

కడప జిల్లా కలెక్టర్‌ శ్రీ హరికిరణ్‌ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌కు ఒంటిమిట్ట తలమానికమని, ఈ ఆలయాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆలయమన్నారు. ఒంటిమిట్టకు విచ్చేసే భక్తులకు రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయని, రానున్న రోజులలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా టిటిడి నిర్మించనున్న కల్యాణ వేదిక, స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వీక్షించే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలలోని ఆలయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అదేవిధంగా టిటిడి తిరుమలలో భక్తులకు ఏవిధంగా ఉచిత అన్నప్రసాదాలు అందిస్తుందో అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా దశలవారిగా అన్నప్రసాదాలు అందించాలని కోరారు.

అనంతరం నూతనంగా ప్రారంభించిన యాత్రికుల వసతి సమూదాయంలో ఒంటిమిట్ట అభివృద్ధికి సంబంధించిన మాస్టార్‌ప్లాన్‌ను టిటిడి, ప్రభుత్వ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటెషన్‌ ద్వారా వీక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.