LORD CHARMS AS “MOHINI”_ మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tirupati, 25 May 2018: On fifth day morning on Friday, Lord Sri Govinda Raja Swamy charmed devotees in Monini Avatar.

As a part of the ongoing annual Brahmotsavams of Lord Govinda Raja Swamy, the devotees were enchanted by the grace of the celestial beauty.

Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Local temples DyEO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt, Sri Jnana Prakash and other temple officials and devotees participated in the grand Brahmotsavam events through out the day.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి, 2018 మే 25: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 5.00 గంటలకు పల్లకీ ఉత్సవం ప్రారంభమైంది. ఆలయ నాలుగు మాడ వీధులతోపాటు పుష్కరిణి, శ్రీ కోదండరామాలయం వరకు వెళ్లి తిరిగి ఉదయం 9.00 గంటలకు స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో హేయమైన విషంతోపాటు ఉపాదేయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచింపబడడం, దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది.

అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.