మార్చి 25 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

మార్చి 25 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

మార్చి 24, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 25వ తేదీ నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటిరోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా మూలవర్ల తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై రాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

మార్చి 26న శ్రీ సీతారాముల కల్యాణం :

మార్చి 26వ తేదీ సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. మార్చి 27న ఉదయం స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం, సాయంత్రం 7 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. మార్చి 28వ తేదీన రేపాకుల సుబ్బమ్మతోట ఉత్సవం జరుగనుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.