CHENNAI TRUST DONATES NINE UMBRELLAS TO GODDESS

Tiruchanur, 19 November 2017 : Chennai based Hindu Mahasabha Trust Chairman Sri Veeravasanta Rayalu donated nine traditional umbrellas to Tiruchanoor on Sunday.

This trust has been donating these umbrellas to Goddess Padmavathi Devi during annual brahmotsavams from the past six years.

These umbrellas will be used during Gaja Vahana Seva on Sunday evening.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా 9 గొడుగులు

తిరుపతి, 19 నవంబరు 2017 ; తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి ఆదివారం 9 గొడుగులు, 2 ఆలవాలములు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన హిందూ మహాసభ ట్రస్టు ఛైర్మన్ శ్రీ వీరవసంతరాయల్, డైరక్టర్ ఎ.రామ్ ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులతోపాటు పట్టువస్త్రాలను అధికారులకు అప్పగించారు. వీరు 6 ఏళ్లుగా గజ వాహనం రోజు గొడుగులు సమర్పిస్తున్నారు. ఈ గొడుగులను ఆదివారం రాత్రి గజ వాహనంలో వినియోగిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.