CJ OF HC OFFERS PRAYERS IN SRI PAT_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ|| శ్రీ బి.రాధాకృష్ణన్

Tiruchanoor, 7 July 2018: After assuming charges as Chief Justice of High Court, Justice B Radha Krishnan offered prayers in the temple of Goddess Padmavathi Devi at Tiruchanoor on Saturday evening.

On his arrival at the main entrance of the temple, he was accorded warm welcome in a traditional manner. Tirupati JEO Sri P Bhaskar accompanied the dignitary to the temple.

The CJ along with his family offered prayers in the sanctum sanctorum of Goddess. Later he was offered prasadams. Spl.gr.dy.e.o sri Munirathnam Reddy was also present


ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ|| శ్రీ బి.రాధాకృష్ణన్

జూలై 7, తిరుపతి, 2018 : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని శనివారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ|| శ్రీ బి.రాధాకృష్ణన్ దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ప్రధాన న్యాయమూర్తికి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, అర్చక బృందం కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీ పిఎస్‌.ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.