CJI PRAYS AT TIRUCHANOOR _ అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి 11 జూన్ 2021: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వీ రమణ శుక్రవారం సతీసమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి శ్రీ ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేద ఆశీర్వాదం ఇచ్చారు.
చైర్మన్, ఎమ్మెల్యే, జెఈవో ప్రధాన న్యాయమూర్తికి అమ్మవారి ప్రసాదం, చిత్ర పటం అందించారు.
ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది
Tiruchanoor, 11 Jun. 21: The Honourable Chief Justice of India Justice NV Ramana offered prayers in the shrine of Sri Padmavathi Ammavaru at Tiruchanoor on Friday along with his family.
Earlier on his arrival at the temple entrance he was received with Purnakumbham and welcomed by TTD Chairman Sri YV Subba Reddy and local MLA and ex-officio member Dr C Bhaskar Reddy.
After darshan of Sri Padmavathi Ammavaru the protocol dignitary was offered Vedaseervachanam.
Chairman, MLA, JEO Smt Sada Bhargavi offered Prasadam and laminated photo of Ammavaru.
CVSO Sri Gopinath Jatti, Temple DyEO Smt Kasturi Bai and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI