CM OF AP AND UNION MINISTER OFFERS PRAYERS TO LORD VENKATESWARA _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రివర్యులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రివర్యులు
తిరుమల, మార్చి 30, 2013: రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి శ్రీ జైరాం రమేష్ శనివారం ఉదయం వైకుంఠం-1 మార్గం ద్వారా విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన ద్వారం చెంత అర్చకులు ఇస్తికఫాల్‌తో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు కలిసి వారికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. చైర్మన్, ఈవో, జెఈవో కలిసి శ్రీవారి లడ్డూ ప్రసాదం, పుస్తక ప్రసాదం, స్వామివారి చిత్రపటాలను ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.