ADMISSION COUNSELLING IN TTD COLLEGES FROM JUNE 11 – 14_ జూన్‌ 11 నుండి 14వ తేదీ వరకు టిటిడి జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

Tirupati, 7 June 2018: The counselling for admissions into TTD-run Inter colleges will be conducted from June 11 to 14 in Sri Govindaraja Swamy Arts College in Tirupati.

The candidates have applied for the same in on-line from May 16 to June 1. The total number of seats in Sri Padmavathi Junior College and SV Junior College is 1760, while those who applied online are 15,219. Out of this 8,149 are girls and 7,070 are boys. Among these applicants those who scored over 9 points in Tenth are 5,828.

The college authorities have already sent SMS to the students on the venue and time of counselling. The students must attend the counselling in the designated time with relevant certificates. Seats will be allotted to the students based on merit and reservation basis.

Please visit our website http://admission.tirumala.org for fees and other particulars.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్‌ 11 నుండి 14వ తేదీ వరకు టిటిడి జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

తిరుపతి, 2018 జూన్‌ 07: టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ కోర్సులకు 2018-19 విద్యా సంవత్సరమునకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జూన్‌ 11 నుండి 14వ తేదీ వరకు శ్రీగోవిందరాజస్వామివారి ఆర్ట్స్‌ కళాశాల, తిరుపతి నందు జరుగు కౌన్సిలింగ్‌కు రావలయును.

ఈ విద్యాసంవత్సరము టిటిడి జూనియర్‌ కళాశాలలో ప్రవేశము కొరకు మే 16 నుండి జూన్‌ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ జూనియర్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాలలో ఉన్న మొత్తం సీట్లు 1760 కాగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 15,219 మంది. ఇందులో 8,149 మంది అమ్మాయిలు, 7,070 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరిలో 10వ తరగతిలో 9.0 పైగా జి.పి.ఏ.సాధించిన విద్యార్థినీ, విద్యార్థులు 5,828 మంది ఉన్నారు.

విద్యార్థులందరికి కౌన్సిలింగ్‌కు సంబంధించిన హాజరుకావలసిన తేదీ, సమయమును వారు దరఖాస్తు నందు నమోదు చేసిన ఫోన్‌ నంబరుకు యస్‌.ఎమ్‌.ఎస్‌.ద్వారా పంపించడమైనది. విద్యార్థులు తమకు కేటాయించిన తేదీ మరియు సమయమునకు ధృవపత్రములతో హాజరుకావలయును. హాజరుకాని విద్యార్థినీ, విద్యార్థులకు కళాశాలలయందు ప్రవేశము లేదు మరియు సంక్షిప్త సమాచారము అందినంత మాత్రమున సీటు కేటాయించబడినట్లు కాదు. కళాశాలలోని సీట్లను మెరిట్‌ మరియు రిజర్వేషన్ల వారిగా భర్తీచేయబడును. ఇతర వివరములైన ఫీజులు, ధృవపత్రములు, తేదీ, సమయము http://admission.tirumala.org లో చూడవలయును.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.