CONTRACT EMPLOYEE CAUGHT _ పరకామణిలో చోరికి పాల్పతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు

Tirumala,30 April 2023:  The TTD vigilance sleuths have identified a contract Parakamani employee hiding a bundle of US currency during a currency counting session at the Parakaman building in Tirumala and taken him into custody. During interrogation, they traced the currency and thereafter they handed him over to the police and a case has been registered against the person.

 

The fine-tuned systems and cameras at the new Parakamani building have made easy detection and scrutiny possible to catch the culprits red-handedly. TTD vigilance officials said no scope for such incidents will be given away in future too and the surveillance would continue with more vigil on a 24×7 basis.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పరకామణిలో చోరికి పాల్పతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు

– పోలీసు కేసు నమోదు

తిరుమల 30 ఏప్రిల్ 2023: తిరుమలలోని నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు , సిసి కెమరాల నిఘా ఏర్పాటు చేయడంతో అక్రమాలకు పాల్పడే వారిని విజిలెన్స్ అధికారులు ఇట్టే గుర్తిస్తున్నారు.

ఇవాళ నోట్ల లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకుని బయటకు వెళుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సిసి కెమెరాల ద్వారా గుర్తించి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తనిఖీల్లో నోట్లను గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.

నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చెయ్యడం….అడుగడుగునా సిసి కెమెరాల నిఘా వుంచడంతో ప్రతి ఒక్కరి కదలికపై సూక్ష్మ స్థాయిలో నిఘా ఉంచుతున్నారు.

గతంలోను ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే గుర్తించే వెసులుబాటు ఉండేది కాదు. నూతన పరకామణి మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన భధ్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో స్వామి సేవ కోసం వచ్చి , చోరీకి పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించగలుగుతున్నారు. భవిష్యత్త్ లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కోనసాగుతుందని భధ్రతాధికారులు స్పష్టం చేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది