CONVOCATION HELD_ ఘనంగా తిరుమల వేదవిజ్ఞానపీఠం 126వ స్నాతకోత్సవం

Tirumala, 07 September 2018: The 126th convocation ceremony of Dharmagiri Veda Vignanam Peetham was held in Tirumala on Friday.

Speaking on this occasion the Principal Sri KSS Avadhani said, started in 1884, today there are about 575 students with 50 faculty in 17 Veda and Agama departments in the institute.

He said many students who under went education in Dharmagiri have now settled as priests in temples with in the country and even overseas.

He said this year 78 students passed out masters degrees and later felicitated them with 10gram silver dollar and certificate of merit.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా తిరుమల వేదవిజ్ఞానపీఠం 126వ స్నాతకోత్సవం

సెప్టెంబర్‌ 07, తిరుమల 2018: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం 126వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ కె.ఎస్‌.ఎస్‌. అవధాని మాట్లాడుతూ తిరుమలలో 1884వ సంవత్సరంలో కళాశాల స్థాపించినట్లు తెలిపారు. 17 విభాగాలకు చెందిన 50మంది అధ్యాపకుల పర్యవేక్షణలో 575 మంది విద్యార్థులకు వేదాలు, ఆగమాలు, స్మార్థం, దివ్యప్రబంధ విభాగాలలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీరిలో 78 మంది విద్యార్థులకు ఈ ఏడాది విద్యాసంవత్సర స్నాతకోత్సవంలో పట్టభద్రులైనట్లు తెలిపారు.

ఇక్కడ వేదవిద్యను అభ్యసించిన విద్యార్థులు కొందరు టి.టి.డి వేదపారాయణ పథకం ద్వారా వేదపారాయణదారులుగాను, దేశ విదేశాల యందు ప్రముఖ దేవాలయాలలో అర్చకులుగా, స్మార్త పండితులుగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ ఆలయాలలో అర్చకులుగాను, కళాశాలలో ఉపాధ్యాయులుగా, మైసూర్‌, కంచి, శృంగేరి వేదాధ్యయన సంస్థల్లో పండితులుగా ఉద్యోగావకాశాలు పొందినట్లు తెలిపారు.

అనంతరం పట్టభద్రులైన విద్యార్థులకు 10 గ్రాముల స్వామివారి వెండి డాలరు మరియు నగదు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వేదపాఠశాల ఆధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.