EO INSPECTS ARCHITECTURAL LIGHTING SYSTEM_ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక విద్యుద్దీపాలంకరణ పనుల పరిశీలన

Tirumala, 7 September 2018: TTD EO Sri Anil Kumar Singhal on Friday inspected the architectural lighting system set up inside Ranganayakula Mandapam in Tirumala temple.

To give an enhanced look to the ancient sculpting of the temple, TTD has come up with innovative idea.

On a trial basis, TTD has completed the light effect in Ranganayakula Mandalam.

MLC Sri Magunta Sreenivasulu Reddy has come forward to bear the expenditure for the special lighting system.

Along with EO, JEOs Sri KS Sreenivas Raju, Sri P Bhaskar, SE Electrical Sri Venkateswarulu were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ప్రత్యేక విద్యుద్దీపాలంకరణ పనుల పరిశీలన

సెప్టెంబరు 07, తిరుమల 2018: బ్రహ్మోత్సవాల కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక విద్యుద్దీపాలంకరణ పనులను శుక్రవారం టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ పరిశీలించారు.

శిల్పాలు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రత్యేకమైన లైట్లతో అలంకరిస్తారు. ఈ వెలుగుల్లో శిల్పాల సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. ఎంఎల్‌సి శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి విరాళంతో శ్రీవారి ఆలయంలో ఇలాంటి లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ముందుగా రంగనాయకుల మండపంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక విద్యుద్దీపాలంకరణ పనులను ఈవో పరిశీలించారు.

ఈవో వెంట టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ తదితరులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.