COORDINATION MEETING HELD _ తిరుమలలో వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
Tirumala, 6 Jan. 22: As the Vaikuntha Ekadasi fete is nearing, a co-ordination meeting was held by TTD Vigilance with Tirumala police under the instructions of TTD CVSO Sri Gopinath Jatti.
The meeting was held in the Conference hall at PAC 4 on Thursday evening by VGO Sri Bali Reddy.
Keeping in view the previous year experience, both the TTD and police sleuths discussed in length on the hassle-free traffic and queue line management arrangements to be made for the big day.
Deputy EOs Sri Ramesh Babu, Sri Lokanatham, OSD Sri Ramakrishna, AEO Sri Gopinath, DSP Sri Prabhakar, Traffic DSP Sri Venugopal, CI Sri Chandrasekhar, all sector AVSOs were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
తిరుమల, 2022 జనవరి 06: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా తిరుమలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లపై టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి ఆదేశాల మేరకు టిటిడి విజిలెన్స్, తిరుమల పోలీసులతో సమన్వయ సమావేశం తిరుమల పీఏసీ – 4లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం జరిగింది.
గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పార్కింగ్, క్యూ లైన్ నిర్వహణ తదితర ఏర్పాట్లపై టిటిడి మరియు పోలీసు అధికారులు సుదీర్ఘంగా చర్చించారు.
తిరుమల విజివో శ్రీ బాలిరెడ్డి ఆధ్వర్యంలో జరిగి ఈ సమావేశంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీ లోకనాథం, ఓఎస్డీ శ్రీరామకృష్ణ, ఏఈవో శ్రీ గోపీనాథ్, డీఎస్పీ శ్రీ ప్రభాకర్, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ వేణుగోపాల్, సీఐ శ్రీ చంద్రశేఖర్, అన్నిసెక్టర్ల ఏవిఎస్వోలు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.