ASTABHANDHANA MARDANAM AT SRINIVASA MANGAPURAM TEMPLE_ శ్రీ‌నివాస‌మంగాపురంలో శాస్త్రోక్తంగా అష్టబంధన మ‌ర్ధ‌నం

Srinivasa Mangapuram, 11 Jun. 19: The Agama ritual of Astabandhana Mardanam for preparing the mixture used as an adhesive, was grandly performed at Sri Kalyana Venkateswara temple in Srinivasa Mangapuram on Tuesday.

The TTD Joint Executive Officer Sri B Lakshmikantham and his spouse Smt.Sobhalatha participated in the Punyahavachanam, Viswaksena Aradhana, Sankalpa puja rituals.

On Wednesday, Maha Shanti Abhisekam will be performed to the main idols of the temple along with Purnahuti, Padma Pradakshina. Maha samprokshanam ritual will be conducted later on in Karkataka Lagnam followed by unjal seva and Pedda Sesha Vahanam.

DyEO Sri Dhananjayulu, Vaikhanasa Agama advisor Sri Sundara Vadana Bhattacharya, Sri Mohana Rangacharyulu, Sri Anantasayana Dikshitulu, Pradhana kankana Bhattar Sri Sitaramacharyulu, AEO Sri Lakmaiah, Chief Priest Sri Balaji Rangacharyulu, Superintendent Sri Changalramulu, Sri Ramanaiah, Temple Inspector Sri Anil and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌నివాస‌మంగాపురంలో శాస్త్రోక్తంగా అష్టబంధన మ‌ర్ధ‌నం

తిరుప‌తి, 2019 జూన్ 11: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మంగ‌ళ‌వారం అష్ట‌బంధ‌న మ‌ర్ధ‌న కార్య‌క్ర‌మం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా పుణ్యాహ‌వ‌చ‌నం, విష్వ‌క్సేనారాధ‌న‌, సంక‌ల్ప‌పూజ నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఆల‌యంలోని ముఖ మండ‌పంలో అష్ట‌బంధ‌న మ‌ర్ధ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అష్ట‌బంధ‌న ద్ర‌వ్యాల‌ను రోటిలో వేసి రోక‌లితో బాగా దంచారు. టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అర్చ‌కుల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆ త‌రువాత బంగారం, న‌వ‌ర‌త్నాలను జెఈవో ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా తీసుకెళ్లి గ‌ర్భాల‌యంలోని మూల‌మూర్తి పాదాల కింద ఉంచారు. అనంత‌రం జెఈవో దంప‌తులు యాగ‌శాల‌ను ద‌ర్శించారు.

కాగా, బుధ‌వారం సాయంత్రం 3.30 నుండి 5 గంట‌ల వ‌ర‌కు మూల‌వ‌ర్ల‌కు మ‌హాశాంతి అభిషేకం చేప‌డ‌తారు. జూన్ 13న గురువారం ఉద‌యం 5 నుండి 7 గంట‌ల వ‌ర‌కు పూర్ణాహుతి, ప‌ద్మ‌ప్ర‌ద‌క్షిణం, ఉద‌యం 7.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు క‌ర్కాట‌క ల‌గ్నంలో మహాసంప్రోక్షణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ‌, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష‌వాహ‌న సేవ జ‌రుగ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ సుంద‌రవ‌ర‌ద భ‌ట్టాచార్య‌లు, శ్రీ‌ మోహ‌న రంగాచార్యులు, శ్రీ అనంత‌శ‌య‌న‌ దీక్షితులు, ప్రధాన కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సీతారామాచార్యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మ‌ణ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.