CS OFFERS PRAYERS IN TIRUCHANOOR _ అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
TIRUPATI, 28 JANUARY 2023:The Chief Secretary of AP Dr. KS Jawahar Reddy offered prayers in Tiruchanoor on Saturday evening.
He was received by temple DyEO Sri Lokanatham and had the darshan of Sri Padmavathi Ammavaru. Later he was offered prasadam by Deputy EO.
The CS also participated in Chandraprabha Vahana Seva as part of the Radhasaptami celebrations.AEO Sri Prabhakar Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
తిరుపతి,28 జనవరి 2023 ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆలయంలో ధ్వజసంభానికి మొక్కుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం డిప్యూటీ ఈవో తీర్థప్రసాదాలు అందించారు.
తరువాత డాక్టర్ కె. ఎస్ జవహర్ రెడ్డి శ్రీ పద్మావతి అమ్మవారి చంద్రప్రభ వాహన సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది