CULTURAL BONANZA OF SRI KVST BTU FETE_ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
Srinivasa Mangapuram, 27 Feb. 19: The ongoing annual Brahmotsavams of Sri Kalyana Venkateswara temple offered a bonanza of cultural feast to devotees.
The artists of HDPP, Annamacharya project, Dasa Sahitya Project and Sri Venkateswara Music and dance School.
Veda parayanam and mangala dwani and dharmikopanyasam were rendered by students of Sri Venkateswara music and Dance College, Sri Vedic University and Sri TV Raghavacharyulu.
in the evening Tirupati team of Smt .revathi and KUdaya bhaskar Presented Bhakti sangeet ,followed by Annamacharya sankeertans b DPSS Rajeshwari and Annamacharya vinnapalu by Team of Smt P Shailaja. The Sri Manda Anantakrishna team of Tirupati also gave venu Vaidya sangeet programs at Ramachandra Pushkarani.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ
తిరుపతి, 2019 ఫిబ్రవరి 27: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మండపంలో ఎస్.వి.సంగీత కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్శిటి ఆధ్వర్యంలో ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ టి.వి.రాఘవాచార్యులు ధార్మికోపన్యాసం చేశారు.
సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు తిరుపతికి చెందిన కె.రేవతి మరియు కె.ఉదయ్ భాస్కర్ బృందం భక్తి సంగీతం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్ సేవలో డి.పి.ఎస్.ఎస్. రాజేశ్వరి అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన పి. శ్రీ శైలజ బృందం అన్నమయ్య విన్నపాలు భక్తి సంగీతం వినిపిస్తారు.
అదేవిధంగా తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ మంద అనంతకృష్ణ బృందం వేణు వాద్య సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.