SNAPANA TIRUMANJANAM AT SRI KVST_ వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజనం శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు

Srinivasa Mangapuram, 27 Feb. 19: On the fourth day of the ongoing annual Brahmotsavams the holy ritual of snapana Thirumanjanam was performed at the Sri Kalyana Venkateswara temple at Srinivasa Mangapuram.
The Kankanala bhattar Sri Balaji Rangacharyulu said the ritual was held at the Kalyana mandapam after daily pujas .The pundits chanted Vedic hymns and seven varieties if garlands were offered to the deities.
Temple DyEO Sri Dhananjayulu, AEO Sri Lakmaiah, Supdt Sri Chengalrayulu, Temple Inspector Sri Anil, temple archakas, officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజనం శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు

తిరుపతి, 2019 ఫిబ్రవరి 27: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) నాలుగో రోజైన బుధ‌వారం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.

ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో వివిధ రకాల సాంప్ర‌దాయ పూలు, రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.