TTD EO OFFERS SILK VASTRAMS TO SRI SAILAM MALLIKARJUNA_ శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామికి టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ
Tirumala, 27 Feb. 19: TTD Executive Officer Sri Anil Kumar Singhal on Wednesday offered traditional silk vastrams to Sri Mallikarjuna Swamy of Srisailam on the occasion of the ongoing brahmotsavams.
TTD EO was given traditional welcome at the Srisailam temple by EO Sri Ramachandra Murthy. Later TTD EO presented the traditional silks on behalf of TTD.
After the darshan of Sri Bhramaramba Mallikarujuna, the EO of TTD was presented Thirtham Prasadam and also laminated photo of Lord Mallikarjuna by Sri Sailam temple EO.
Speaking on the occasion the TTD EO said that since 1996 special silks were being offered to Srisailam temple ahead of Maha Shivarathi. He also hailed the spiritual links between Tirumala and Srisailam.
Srivari Temple OSD Sri Pala Seshadri was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామికి టిటిడి ఈవో పట్టువస్త్రాలు సమర్పణ
ఫిబ్రవరి 27, తిరుమల, 2019: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి బుధవారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు శ్రీశైలం ఆలయ ఈవో శ్రీశ్రీరామచంద్రమూర్తి, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈవో స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు టిటిడి ఈవోకు తీర్థప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటం అందించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకుని 1996వ సంవత్సరం నుండి శ్రీశైలం దేవస్థానానికి టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుమల క్షేత్రానికి, శ్రీశైలానికి ఎంతో దగ్గర సంబంధం ఉందని, నల్లమల కొండలు ఆదిశేషుని అవతారమని, తల భాగంలో తిరుమల, మధ్యలో అహోబిలం, తోక భాగంలో శ్రీశైలం క్షేత్రాలు ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తోందని అన్నారు. శ్రీశైలంతోపాటు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం, శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి ఆలయం, సురుటుపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వరస్వామివారి ఆలయం తదితర శైవాలయాలకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.