GRAND CONCLUSION OF HOMA MAHOTSAVAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE_ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

Tirupati,18 November 2017: The month-long Homa Mahotsavam underway at the Sri Kapileswarswamy Temple concluded in a grand manner today with the Sri Chandikeswaraswami Homam.

The rituals of Maha purnahuti, Kalasa Udwasana, Kalashabisekam, and Ankurarpana visarhana were performed in the morning as part of the Sri Chandikeswaraswami Homam.

Later in the evening Laksha deeparadhana and Aradhana of Pancha murtis – Sri Vigneswara, Sri Valli Devasena along with Subramanya, Sri Kapileswara Swamy, Sri Kamakshi ammavaru, Sri Chandikeswaraswami were performed.
Among others, local temples Dy EO Sri Subramanyam, AEO Sri Shankara Raju, Temple priests Sri Mani Swamy, Sri Swaminath Swamy, Sri Vijaya swami, and other officials and devotees participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

తిరుపతి, 18నవంబరు 2017; తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగాయి. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, కలశాభిషేకం, అంకురార్పణ విసర్జన నిర్వహించారు.

సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. సాయంత్రం పంచమూర్తులకు వీధి ఉత్సవం వైభవంగా జరుగనుంది. ఈ హోమాల్లో పాల్గొన్న భక్తులకు విద్య, వివాహం, ఉద్యోగం, సంతాన ప్రాప్తి కలుగుతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం ఏఈవో శ్రీశంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ మణిస్వామి, శ్రీస్వామినాథస్వామి, శ్రీవిజయ స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.