CULTURAL EVENTS ALLURES_తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
Tirumala, 4 Oct. 19: The series of cultural events organized by TTD at Tirupati in view of annual brahmotsavams of Tirumala attracted people on Friday.
The devotional music events at Mahati and other cultural places including Annamacharya Kalamandiram and Ramachandra Pushkarini in Tirupati.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ
అక్టోబరు 04, తిరుమల, 2019 ; శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో శుక్రవారం టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన అన్నమాచార్య భావవాహిని బృందం చక్కటి భక్తి సంగీతం వినిపించారు.
అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన డా. సరస్వతి వాసుదేవన్ బృందం భక్తి సంకీర్తనలు వినిపించారు.
రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ హిమబిందు బృందం నృత్య కార్యక్రమం నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.