CULTURAL PROGRAMMES ATTRACT DEVOTEES _ హనుమజ్జయంతి నాడు ఆకట్టుకున్న ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీతం
TIRUMALA, 25 MAY 2022: The series of devotional programmes which were arranged by TTD at Akasa Ganga, Japali and Nada Neerajanam platform on Wednesday on the auspicious occasion of Hanuman Jayanti, attracted devotees.
The Pravachanams by renowned scholars Sri C Ranganathan, Sri Ranga Ramanujacharyulu on Hanuman Jananam and Vaibhavam immersed the pilgrim devotees in devotion. While the devotional music rendered by Sri Madhusudhan Rao and his team, Sri Uday Bhaskar of Annamacharya Project, Smt Sandhya Srinadh rendered Hanuman Songs from Dasa Sahitya and allured the devotees while Dr K Vandana rendered Tyagaraja Kritis and Ramadasu Sankeertans which mesmerized the pilgrims who thronged at Japali and Akasa Ganga.
In the evening the Harikatha by Smt Vijayakumari enthralled the devotees. Sri Purushottam, Program Assistant supervised the arrangements.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
హనుమజ్జయంతి నాడు ఆకట్టుకున్న ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీతం
తిరుమల, 2022 మే 25: హనుమజ్జయంతిని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీతం ఆకట్టుకున్నాయి.
నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు “అంజనానందనం వీరం” అనే అంశంపై జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ఉపన్యసించారు.
ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద బుధవారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డా. పిటిజి.రంగాచార్యులు శ్రీ హనుమ అవతార ఘట్టంపై ఉపన్యసించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి.మధుసూదనరావు బృందం శ్రీ హనుమాన్ చాలీసా, శ్రీరామ, శ్రీ హనుమ సంకీర్తనలు ఆలపించారు. మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకురాలు డా. కొల్లూరు వందన పలు త్యాగరాజ కీర్తనలు, రామ కీర్తనలను హృద్యంగా ఆలపించారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీమతి వి.విజయకుమారి బృందం హరికథ వినిపించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు హనుమంతుని వైభవంపై దాస సంకీర్తనలు గానం చేశారు. ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ పురుషోత్తం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
జపాలి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు బెంగళూరుకు చెందిన శ్రీమతి సంధ్య శ్రీనాథ్ బృందం హనుమంతుని పరాక్రమం, దయాగుణం అంశాలపై భక్తి సంకీర్తనలు గానం చేశారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ కె.ఉదయభాస్కర్ బృందం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకురాలు డా. కొల్లూరు వందన బృందం పలు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.