CVSO INSPECTS CHAKRASNANAM ARRANGEMENTS IN SWAMY PUSHKARINI_ శ్రీవారి పుష్కరిణిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి సివిఎస్‌వో

Tirumala, 30 September 2017: The TTD CVSO Sri Ake Ravi Krishna today inspected the security arrangements of the holy Chakrasnanam to be held tomorrow morning from 6.00 AM to 9.AM at the Swami Pushkarini located besides the Srivari Temple.

Speaking on the occasion the CVSO said 45 swimmers, three boats, 62 fire men and 29 NDRF personnel have been stationed at the Pushkarini along with TTD Vigilance and Security, Police, Srivari Sevakulu and Scouts to ensure that the devotees could experience pleasant and smooth holy dip in sacred waters. He also took a round on the boat and reviewed the gates of common devotees and also the VIP gate locations.

Among others includes, Fire station official Sri Srinivasulu Reddy, VGO Sri Ravindra Reddy, ADFO Sri Srihari Jagannatham, NDRF inspector Sri R P Chaurdhary and AVSO Sri Kurma Rao.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

శ్రీవారి పుష్కరిణిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి సివిఎస్‌వో

సెప్టెంబర్‌ 30, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల చివరి రోజైన ఆదివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు పుష్కరిణిలో జరుగనున్న చక్రస్నానం సందర్భంగా భక్తుల కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను శనివారం సాయంత్రం టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ పరిశీలించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు పుష్కరిణిలో భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మూడు బోట్లతోపాటు 45 మంది గజ ఈతగాళ్లు, 62 మంది అగ్నిమాపక సిబ్బంది, 29 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది, టిటిడి భత్రా సిబ్బంది, పోలీసులు, స్కౌట్స్‌, శ్రీవారి సేవకులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించామన్నారు. భక్తులు ప్రశాంతంగా పుష్కరిణిలో స్నానం ఆచరించేలా చర్యలు చేపట్టామన్నారు.

అనంతరం సివిఎస్‌వో భద్రతా సిబ్బందితో కలిసి పుష్కరిణిలో బోటులో ప్రయాణించి సాధారణ భక్తుల గేట్లు, విఐపి గేట్లు తదితరాలను పరిశీలించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక విభాగం అధికారి శ్రీ శ్రీనివాసులురెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఎడిఎఫ్‌ఓ శ్రీ శ్రీహరిజగన్నాథ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ఆర్‌పి.చౌదరి, రెస్క్యూ టీమ్‌, ఎవిఎస్‌వో శ్రీ కూర్మారావు ఇతర భద్రతా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.