DEVOTEES TO BE ALLOWED INTO PUSHKARINI AFTER 5AM- JEO_ ఉదయం 5 గం||ల నుంచి శ్రీవారి పుష్కరిణిలోకి భక్తుల అనుమతి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 30 September 2017: The devotees will be allowed to enter into Swamy Pushkarini after 5am on Sunday, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Reviewing with the senior officers in sectoral meeting held at Control room on Saturday, the JEO directed all the duty officers to be present by 4am. “The Chakra Snanam takes place between 6am and 9am.

After the first spell is over, the devotees will be allowed after wards. The Security who are guarding the gates should be more alert to see that there is no jostling among devotees. The Radio and broadcasting department should give continuous announcements that the Significance of Chakra Snanam lasts the entire day and there is no need to hurry for sacred dip”, he added.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

ఉదయం 5 గం||ల నుంచి శ్రీవారి పుష్కరిణిలోకి భక్తుల అనుమతి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

సెప్టెంబర్‌ 30, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల చివరి రోజు ఆదివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు జరుగనున్న చక్రస్నానానికి ఉదయం 5.00 గంటల నుంచి భక్తులను పుష్కరిణిలోకి అనుమతిస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని రాంభగీచ విశ్రాంతి గృహం ఎదురుగా గల కంట్రోల్‌ రూమ్‌లో శనివారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఉన్న ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని భద్రత అధికారులకు సూచించారు. పుష్కరిణి వద్ద విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం 4 గంటలకు హాజరుకావాలని ఆదేశించారు. చక్రస్నానం తరువాత రెండో విడతలో గ్యాలరీల్లోకి భక్తులు ప్రవేశించే సమయంలో గేట్ల వద్ద తోపులాట జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పుష్కరిణి వద్ద తాజా సమాచారాన్ని భక్తులకు తెలియజేసేందుకు విరివిగా మెగాఫోన్లు వాడాలని, భక్తులకు అర్థమయ్యేరీతిలో సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. చక్రస్నానం సందర్భంగా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రోజంతా చక్రస్నానం ప్రభావం ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీకోదండరామారావు, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.