SRI RAMAKOTI VIJAYAOTSAVAM AT SRI KRT_ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా ”శ్రీరామకోటి విజయోత్సవం”

Tirupati, 30 September 2017: Sri Ramakoti Vijayotsavam was performed at Sri Kodandaramaswami temple as part of Vijaya Dasami on Saturday in Tirupati.

Devotees who scripted the Ramakoti books during the year submitted their collections at an event on the auspicious day.

They were taken around in a procession on the Mada streets of KRT, Gandhi Road, Prakasham Road and Mahati Auditorium up to Sri Ramachandra Psuhkarini and placed at the Srirama Stupam.

Among others TTD local temples DyEO Smt Munilakshmi, Supdt Sri Munikrishna Reddy and other officials and devotees participated in the event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా ”శ్రీరామకోటి విజయోత్సవం”

తిరుపతి, 30 సెప్టెంబరు 2017: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీరామకోటి విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో, ఇంటి వద్ద పరమ పవిత్రమైన శ్రీరామనామాన్ని

భక్తులు సంవత్సర కాలంలో వ్రాసిన శ్రీరామనామ కోటి పుస్తకాలను శ్రీ రామకోటి స్థూపం నందు నిక్షిప్తం చేయడాన్ని ”శ్రీ రామకోటి విజయోత్సవం”గా ప్రతి సంవత్సరం విజయ దశమినాడు నిర్వహించడం

సాంప్రదాయం.

ఈసందర్భంగా శనివారం సాయంత్రం శ్రీరామనామ కోటి పుస్తకాలను శ్రీకోదండరామస్వామివారి ఆలయం నుండి నాలుగు మాడవీధుల ఊరేగింపుగా దొడ్డాపురంవీధి, గాంధీరోడ్డు, ప్రకాశంరోడ్డు,

మహతి కళాక్షేత్రం మీదుగా శ్రీరామచంద్ర ఉద్యానవన పుష్కరిణికి చేరుకున్నారు. అక్కడ శ్రీ రామకోటి స్థూపం నుందు శ్రీరామనామ కోటి పుస్తకాలను నిక్షిప్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి మునిలక్ష్మీ, సూపరిండెంట్‌ శ్రీ మునిక్రిష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.