CVSO INSPECTS NARAYANAGIRI QUEUE LINES _ నారాయణగిరి ఉద్యానవనాల్లో సివిఎస్‌వో తనిఖీలు

Tirumala, 27 December 2017:TTD CVSO sri A Ravikrishna on Wednesday morning inspected the queue lines in Narayanagiri Gardens and insturcted his sleuths to be alert round the clock as the pilgrim influx will commences from December 28 itself.TTD has deployed 1500 personnel for Vaikuntha Ekadasi and Dwadasi to man the pilgrim crowd.

The chief of TTD Security and Vigilance wing also inspected the toilets and other arrangements made for the pilgrims in queue lines.
VGOs Smt Sada Lakshmi, Sri Ravindra Reddy and others were also present.

Meanwhile TTD has allocated a new toll free number in its common command control room for the sake devotees starting from December 27 till January 2.The pilgrims can dial 1800 425 4242 and lodge complaints if any.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నారాయణగిరి ఉద్యానవనాల్లో సివిఎస్‌వో తనిఖీలు

డిసెంబరు 27, తిరుమల, 2017వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ బుధవారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో గల క్యూలైన్లను తనిఖీ చేశారు. అదేవిధంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1, 2లో పరిశీలన చేపట్టారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి సందర్భంగా 1500 మంది నిఘా, భద్రతా సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. సిసి కెమెరాల నిఘాతో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రత కల్పిస్తామన్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.

సివిఎస్‌వో వెంట విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఎవిఎస్‌వో శ్రీ కూర్మారావు ఇతర అధికారులు ఉన్నారు.

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ 18004254242

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు 18004254242ను అందుబాటులో ఉంచింది. భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు ఈ నంబరు అందుబాటులో ఉంటుంది. తిరుమలలోని కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ భద్రతా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి భక్తుల సూచనలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.