JEO TPT INSPECTED OF THE ARRANGEMENTS FOR NARAYANAVANAM _ నారాయణవనంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు : జెఈవో

Tirupati, 27 December 2017:The TTD JEO Tirupati Sri Pola Bhaskar also inspected the arrangemens for at the local temple of Sri Kalyana Venkateswara at Narayana vanam. Speaking to reporters later he said anticipating large crowds of devotees during the V-days -Ekadasi and Dwadasi elaborate arrangements (vigilance and engineering)were made for faciliating the devotees.He said special facilities were also rolled out in the queuelines like annaprasadam and also drinking etc besides sale of TTD diaries and calenders

TTD local temples Dy EO Smt Jhansi, VGO Sri Ashok kumar Goud, DE(Electricals) Sri Chandrasekhar, and Supdt Sri Chandramouleswara Sharma participated in the JEO inspetion .


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నారాయణవనంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు : జెఈవో

డిసెంబరు 27, తిరుపతి, 2017 ;నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. నారాయణవనంలోని ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం రాత్రి జెఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నాడు టిటిడి స్థానికాలయాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌, ఆలయ అధికారులతో కలిసి పరిశీలన చేపట్టినట్టు తెలిపారు. భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. భక్తుల కోసం టిటిడి క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని జెఈవో కోరారు.

జెఈవో వెంట టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ, విజివో శ్రీ అశోక్‌ కుమార్‌ గౌడ్‌, డిఇ(ఎలక్ట్రికల్‌) శ్రీ చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌ శ్రీ చంద్రమౌళీశ్వర శర్మ ఇతర అధికారులు ఉన్నారు.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.