LORD GLOWS UNDER THE MOONLIGHT ON “CHANDRAPRABHA”_ చంద్రప్రభవాహనంపై సర్వజగదర్శకుడు

Tirumala, 29 September 2017: The beauty and charisma of Lord Malayappa enhanced on Chandra Prabha Vahanam on Friday evening under the moonlight.

On the 7th day of the annual Brahmotsavams, Lord Venkateswara took celestial on Chandra Prabha vahanam to the delight of thousands of devotees who converged in the galleries of the four mada streets at Tirumala to witness the blissful event.

According to legendary, Chandra or the moon stands for promoting medicinal values among living beings including plants. The puranic scripts of “Purushottam Praptiyagam” describe Chandra as Lord Vishnu as an invisible architect who had evolved solutions for all ills of the society.The Saint exponent Geeta Charya says “Nakshatrana Aham Shashi”(I am a spot on the moon) indicating the presence of moon as an integral part of the celestial system.

It was a delightful sight to watch the Lord Malayappa Swamy glide along four mada streets on the pleasant Chandra Prabha Vahanam which has given a chill-thrill experience to devotees.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

చంద్రప్రభవాహనంపై సర్వజగదర్శకుడు

తిరుమల, 2017 సెప్టెంబరు 29: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రాత్రి 9.00 గంటల నుండి 11.00 గంటల నడుమ శ్రీమలయప్పస్వామి వారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపనున్నాడు.

స్వామికి సూర్యచంద్రులు రెండునేత్రాలు. ఉదయం సూర్యప్రభలో ఊరేగిన శ్రీనివాసుడు రాత్రి నిశాకరుడైన చంద్రునిప్రభతో కూడిన వాహనంపై విహరించడం ఎంతైనా సమంజసమే.

చంద్రుడు భగవంతుని మారురూపమే. గీతాచార్యుడు ”నక్షత్రాణాం అహం శశీ” తాను చుక్కలలో చంద్రుడ నని తెలియజేసాడు. అంతేకాక ”పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః” అని కూడా పురుషోత్తమప్రాప్తి యోగంలో ప్రకటించాడు. అంటే రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఓషధులను రాత్రిపురుషోత్తమప్రాప్తి యోగంలో ప్రకటించాడు. అంటే రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఓషధులను పోషిస్తున్నాడని అర్థం. ఆ ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవర ప్రభతో నేడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. పురాణాలలో చంద్రుని గురించిన ప్రస్తావన విస్తృతంగా లభిస్తున్నది. చంద్రుడు శివునికి శిరో భూషణమైతే ఇక్కడ హరికి చంద్రప్రభ వాహనంగా ఉండటం విశేషం.

ఈ చంద్రోత్పత్తి భగవంతుని మనస్సునందే కలిగిందట. అందుకే శ్రుతి ”చంద్రమా మన సో జాతః” అని వివరిస్తున్నది. సూర్యుని అనుసరించి, సూర్యకాంతితో చంద్రుడు భాసిస్తాడు కనుక సూర్యప్రభ వాహనసేవ అనంతరం చంద్రప్రభ వాహనసేవ జరగడం సముచితం.

చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు, చంద్రకాంతమణులు స్రవిస్తాయి. అదేవిధంగా చంద్రప్రభవాహనంపై స్వామిని చూడగానే భక్తమానసాంభోధులు ఉప్పొంగుతాయి. భక్తనేత్రోత్పలాలు వికసిస్తాయి. ఆనందరసం భక్తుల హృదయాలనుండి స్రవిస్తుంది. అందువల్ల ఈ వాహన సందర్శనం ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక మనే త్రివిధ తాపాలను నివారిస్తుంది.

సెప్టెంబరు 30న రథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన శనివారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 5.15 నుండి 6.00 గంటల వరకు కన్యాలగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.00 గంటల నుండి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుధ్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు. కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం ముదావహం.

కాగా రాత్రి 9.00 నుండి 11.00 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.