DAKSHINAMURTHY HOMAM PERFORMED _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం

TIrupati, 26 October 2017: Sri Dakshinamurthy Homam was performed in the temple of Sri Kapileswara Swamy on Thursday in Tirupati.

On October 27, Navagraha Homam will be performed. The Gruhasta pilgrims can take part in this ritual on payment of Rs.500 on which two persons will be allowed.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం

తిరుపతి, 2017, అక్టోబరు 26: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, హోమం, లఘు పూర్ణాహుతి, విశేష దీపారాధన నిర్వహిస్తారు.

అక్టోబరు 27వ తేదీ శుక్రవారం శ్రీ నవగ్రహ హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ మణిస్వామి, శ్రీ స్వామినాథస్వామి, శ్రీవిజయస్వామి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.