DECISION ON SEVAS AND DARSHAN AFTER UNLOCK 6 GUIDELINES – TTD EO _ ప్ర‌భుత్వ అన్‌లాక్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కే వృద్ధులు, చిన్న‌పిల్ల‌ల ద‌ర్శ‌నంపై నిర్ణ‌యం : డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala, 8 Nov. 20: As Unlock 6 guidelines are being awaited from the Central Government, there is no change at present on the decision of introducing sevas or providing darshan to senior citizens, said TTD EO Dr KS Jawahar Reddy.

Answering the pilgrim callers during his maiden Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Sunday, the EO attended to the calls of 29 callers. Many of the queries were related to the reintroduction of arjitha sevas, which were cancelled during the lockdown period, darshan to senior citizens, physically challenged, infants and children. While some other callers poured in laurels on TTD and SVBC for telecasting Sundarakanda, Bhagavat Gita and Virataparva Parayanams during Corona high times.

While a few callers brought to the notice of EO on the issues related to TTD Kalyana Mandapams located at the respective areas which needed attention for proper maintenance, to which EO immediately instructed the concerned officials to sort out the issues. 

A caller Sri Ramachandra Rao from Hyderabad suggested EO to go for Dubai Airport Model system for providing darshan to senior citizens without making them wait for hours to get darshan to which the EO answered the officers will take a look into the suggestion and see the possibilities to implement in Tirumala.

Another caller Sri Srinivasulu from Nellore informed the EO that TTD should continue the Covid guidelines strictly by sanitizing the temple and accommodation areas as the pilgrim strength to Tirumala is considerably increasing to which EO said, all the precautions will be definitely taken into consideration.

A pilgrim caller Sri Manoj Kumar from Guntur while complimenting all the Parayanams, sought to introduce Garuda Purana Parayanam also to which the EO replied that the modalities of the programme is already on chords and will soon be introduced.

Sri Sunil Babu from Visakhapatnam brought to the notice of EO that earlier the timings of blood donation at Aswini Hospital in Tirumala used to be from 6 am to 6 pm while now the time is reduced to 9 am and 12noon. Answering the caller EO said, the decision might be due to existing Covid norms. However, he assured that it will be discussed and the necessary decision will be taken.

Sri Dorababu from Vedurukuppam requested EO to reopen the Shravanam school run by TTD which is meant for Deaf and Dumb infants and children which was closed from the past five months as the differently-abled children are facing serious problems. Reacting to the caller, the EO said, due to lockdown norms the school has been closed and after the unlock 6 guidelines a proper decision will be taken. “We have already commenced online classes for our students. But since this is a special school, we will take a decision soon”, he added.

Another caller Sri Krishnamurthy from Narasapuram told EO that TTD has been promoting more Saivaite programmes like Karthika Deepotsava though it is a Vaishnavaite temple.  Answering the caller EO said, this has been discussed in length with all the Agama Scholars and Vedic Pundits who concluded that there is no difference between Lord Vishnu and Lord Shiva (Siva Kesava Abedha and Karthika month is auspicious for both the deities) and in Tirumala it is an age-old practice of observing Karthika Deepotsavam in a big way.

Earlier, before attending to pilgrim callers, the EO briefed on some important religious festivals lined up in the month including Deepavali Asthanam on November 14, Nagula Chaviti on November 18, Pushpayagam on November 21.

Additional EO Sri AV Dharma Reddy, JEOs Sri P Basant Kumar, Smt Sada Bhargavi, CEO Sri Suresh Kumar, CE Sri Ramesh Reddy, Additional CVSO Sri Sivakumar Reddy and other senior officers were also present.  

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పత్రికా ప్రకటన                                            తిరుమల, 08, న‌వంబ‌రు 2020

ప్ర‌భుత్వ అన్‌లాక్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కే వృద్ధులు, చిన్న‌పిల్ల‌ల ద‌ర్శ‌నంపై నిర్ణ‌యం : డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అన్‌లాక్ మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని ప‌దేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు, 65 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తికి చెందిన గీత‌, ప‌ల‌మ‌నేరుకు చెందిన యుగంధ‌ర్‌, క‌ర్నూలుకు చెందిన వెంక‌ట‌రాముడు, అనంత‌పురానికి చెందిన రెడ్డెయ్య‌ అనే భ‌క్తులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఈవో పైవిధంగా స‌మాధాన‌మిచ్చారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి – తూర్పుగోదావ‌రి, శ్రీ‌నివాస‌రెడ్డి – మంగ‌ళ‌గిరి

ప్రశ్న: 2006వ సంవ‌త్స‌రంలో అభిషేకం టికెట్ బుక్ చేసుకున్నాం. న‌వంబ‌రు 6న స్లాట్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆర్జిత సేవ‌లు లేవు. తిరిగి అభిషేకం టికెట్ ఇస్తారా?

ఈవో : లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 13 నుండి జూన్‌ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ (tirupatibalaji.ap.gov.in) ద్వారాగానీ, పోస్టాఫీసు, ఇ-దర్శన్‌ మరియు ఎపి ఆన్‌లైన్‌ కౌంటర్ల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల‌ను బుక్‌ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్‌ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు అవకాశం కల్పించాం. టికెట్లు రద్దు చేసుకోవడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

2. కృష్ణ‌మూర్తి – న‌ర‌సాపురం

ప్రశ్న: కార్తీక మాసంలో తిరుమ‌ల‌లో శివుడి కార్య‌క్ర‌మాలు ఎలా నిర్వ‌హిస్తారు?

ఈవో :  శివ‌కేశ‌వులిద్ద‌రూ ఒక్క‌రేన‌ని పండితులు చెబుతున్నారు. కాబ‌ట్టి కార్తీక మాసంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

3. సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర‌రావు – తాడేప‌ల్లిగూడెం

ప్రశ్న: అక్టోబ‌రు 30న డైరీలు, క్యాలెండ‌ర్లు బుక్ చేశాం. ఇంకా అంద‌లేదు?

ఈవో :  త‌పాలా శాఖ అధికారుల‌తో మాట్లాడి మీకు అందేలా చూస్తాం.

4. ఆదినారాయ‌ణ – నెల్లూరు

ప్రశ్న: టిటిడి క‌ల్యాణ‌మండ‌పాన్ని బుక్ చేసేందుకు ఎమ్మార్వో స‌ర్టిఫికేట్ అడుగుతున్నారు?

ఈవో :  మీకు ఫోన్‌లో వివ‌రాలు తెలియ‌జేస్తాం.

5. సునీల్ – వైజాగ్‌

ప్రశ్న: తిరుమ‌ల అశ్విని ఆసుప‌త్రిలో ర‌క్త‌దానం చేసేందుకు ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌యాన్ని పెంచండి?

ఈవో :  ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం.

6. మ‌నోజ్ కుమార్ – గుంటూరు, గాయత్రి – హైద‌రాబాద్‌

ప్రశ్న: గ‌రుడ పురాణం ఎప్పుడు ప్రారంభిస్తారు. గీతాపారాయ‌ణాన్ని పిల్ల‌లకు కూడా అర్థ‌మ‌య్యేలా చెప్పించండి ?

ఈవో :  సుంద‌ర‌కాండ‌, గీతాపారాయ‌ణం, విరాట‌ప‌ర్వం పారాయ‌ణాలకు భ‌క్తుల నుండి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈ కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేసిన అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి, ఎస్వీబీసీ సిబ్బందికి అభినంద‌న‌లు. గ‌రుడ పురాణం త్వ‌ర‌లో ప్రారంభిస్తాం. భ‌గ‌వ‌ద్గీత‌ను పిల్ల‌ల‌కు కూడా అర్థ‌మ‌య్యేలా పారాయ‌ణం చేసి అర్థం వివ‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటాం.

7. శ్రీ‌నివాసులు – నెల్లూరు

ప్రశ్న: రెండు రోజుల క్రితం ద‌ర్శ‌నానికి వ‌చ్చాను. శ్రీ‌‌వారి ఆల‌య మ‌హ‌ద్వారం వ‌ద్ద ట్రై ఓజోన్  స్ప్రేయింగ్ సిస్ట‌మ్ శానిటైజ‌ర్ ప‌ని చేసేలా చూడండి?

ఈవో :   ప‌రిశీలించి ట్రై ఓజోన్  స్ప్రేయింగ్ సిస్ట‌మ్ శానిటైజ‌ర్ ప‌నిచేసేలా చూస్తాం.

8. శంక‌ర్‌రావు – తిరుప‌తి

ప్రశ్న: తిరుమ‌ల‌లో వివాహం చేసుకోవ‌డ‌మెలా?

ఈవో : టిటిడి క‌ల్యాణ‌వేదిక‌లో సంప్ర‌దించి కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు 200 మందికి మించ‌కుండా వివాహం చేసుకోవ‌చ్చు.

9. ముర‌ళీప్ర‌సాద్ – తిరుప‌తి

ప్రశ్న: 2 గ్రాముల బంగారు డాల‌ర్లు ల‌భించ‌డం లేదు.

ఈవో :   ఆర్డ‌ర్ ఇచ్చాం. త్వ‌ర‌లో అందుబాటులో ఉంచుతాం.

10. వేంక‌టేశ్వ‌ర్లు – న‌ర‌సాపురం

ప్రశ్న: న‌ర‌సాపురంలోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పంలో లైటింగ్‌, డెక‌రేష‌న్ ఒకే వ్య‌క్తి చేస్తూ అధిక ధ‌ర వ‌సూలు చేస్తున్నాడు. చ‌ర్య తీసుకోండి?

ఈవో :  ఈ విష‌యాన్ని ప‌రిశీలించి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం.

11. చిరంజీవి – తిరుప‌తి

ప్రశ్న: సుంద‌ర‌కాండ పారాయ‌ణాన్ని 16 గంట‌ల పాటు నిర్వ‌హించండి. ద‌ర్శన క్యూలైన్లలో భౌతిక దూరం పాటించ‌డం లేదు?

ఈవో :   సుంద‌ర‌కాండ పారాయ‌ణాన్ని 16 గంట‌ల పాటు నిర్వ‌హించే అంశాన్ని ప‌రిశీలిస్తాం. కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు ద‌ర్శన క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటాం.

12. వినోద్ కుమార్ – బ‌ళ్లారి

ప్రశ్న: అష్ట‌ద‌ళపాద‌ప‌ద్మారాధ‌న సేవ వాయిదా వేసుకునేందుకు లేఖ ద్వారా టిటిడికి విజ్ఞ‌ప్తి చేశాను‌?

ఈవో : మీకు వివ‌రాలు తెలియ‌జేస్తాం.

13. సుబ్బ‌రామ‌శాస్త్రి – హైద‌రాబాద్‌

ప్రశ్న: ఆన్‌లైన్ క‌ల్యాణం టికెట్లు బుక్ చేసుకున్న వారు ద‌ర్శ‌నానికి వ‌చ్చే కాలాన్ని 90 రోజుల నుండి 180 రోజులకు పెంచండి. తిరుమ‌ల‌లోనే ప్ర‌సాదాలు ఇవ్వండి?

ఈవో : మీ సూచ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాం.

14. సురేష్ – హైద‌రాబాద్‌

ప్రశ్న: ఆన్‌లైన్ ఆర్జిత‌సేవ‌ల బుకింగ్ గ‌డువును 4 నెల‌ల నుండి 2 నెల‌ల‌కు త‌గ్గించండి. క‌ల్యాణోత్స‌వం, సుప్ర‌భాతం సేవ‌ల‌కు స్థ‌లం ఇరుకుగా ఉంది. సిఆర్వో కార్యాల‌యం నుండి గ‌దులు ఉన్న చోట‌కు వెళ్లాలంటే ర‌వాణాప‌రంగా ఇబ్బందిగా ఉంది?

ఈవో : ఈ అంశాల‌ను ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం.

15. జ‌యంత్ – తిరుప‌తి

ప్రశ్న: ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని విస్తృతం చేయండి?

ఈవో : ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని విస్తృతం చేయ‌డానికి ప‌లు కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నాం. స్వ‌చ్ఛందంగా భ‌క్తులు ముందుకొ‌స్తే ధ‌ర్మ‌ప్ర‌చారం  చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తాం.

16. ర‌మ‌ణ – క‌డ‌ప‌

ప్రశ్న: వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వ‌ద‌ర్శం టోకెన్లు ఇస్తారా ?

ఈవో : ప‌్ర‌భుత్వ అన్‌లాక్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

17. రామ‌చంద్ర‌రావు – హైద‌రాబాద్‌

ప్రశ్న: ఎయిర్‌పోర్టు మేనేజ్‌మెంట్ విధానం ద్వారా తిరుమ‌ల‌లో క్యూలు లేకుండా చేయండి ?

ఈవో : దీనిపై విస్తృతంగా చ‌ర్చించాల్సి ఉంది.

18. శోభారాణి – హైద‌రాబాద్‌

ప్రశ్న: నేను ప్ర‌భుత్వ వైద్య‌, ఆరోగ్య శాఖ‌లో రిటైర్డ్ ఉద్యోగిని. నాకు తిరుమ‌ల‌లో ఏదైనా ప‌ని ఇవ్వండి ?

ఈవో : మా అధికారులు మిమ్న‌ల్ని ఫోన్‌లో సంప్ర‌దిస్తారు.

19. దొర‌బాబు – వెదురుకుప్పం

ప్రశ్న: మా పాప టిటిడి శ‌్ర‌వ‌ణం కేంద్రం విద్యార్థి. త్వ‌ర‌లో ఆ కేంద్రాన్ని తెరిపించండి ?

ఈవో : ప‌్ర‌స్తుతం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేరకు శ్ర‌వ‌ణం కేంద్రాన్ని త్వ‌ర‌లో తెరుస్తాం.

20. తేజ‌కిర‌ణ్ – గుంటూరు

ప్రశ్న: ఆర్జిత సేవ‌లు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారు ?

ఈవో : ప‌్ర‌భుత్వ కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

21. కృష్ణ‌మోహ‌న్ – గ‌ద్వాల్‌

ప్రశ్న: చిన్న‌పిల్లల ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక కౌంట‌రు ఏర్పాటు చేయండి. ఉగాది పంచాంగాన్ని వ్య‌వ‌హారిక భాష‌లో ముద్రించండి ?

ఈవో : చిన్న‌పిల్లల ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక కౌంట‌రు ఏర్పాటు సాధ్యం కాదు. పంచాంగాన్ని స‌ర‌ళీక‌రిస్తాం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్‌ఆర్‌.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ నాగ‌రాజ‌, శ్రీ సెల్వం ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.