DECORATIONS HIGHLIGHT FESTIVITIES AT SRI KVT_ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ, విద్యుత్‌ దీపాల శోభతో అలరారుతున్న శ్రీ కల్యాణ వెంకన్న ఆలయం

Srinivasa Mangapuram, 27 February 2019: Flower decorations and bright electrical cutouts added grandeur to the ongoing nine-day annual Brahmotsavams of Sri Kalyana Venkateswara temple of Srinivasa Mangapuram.

The 30 member team from the TTD garden department excelled in decorating the dwaja mandapam, Garbhalayam and vahanam Mandapams with six tons of colourful and aromatic flowers. The TTD electrical department put up arches; cutouts of Goddesses etc. attracting large crowds.

TTD also organised arches and cut outs on the highway from Tirupati and Chandragiri and near Pushkarani with huge cutout’s of God’s and Godesses

The Annaprasadam wing of TTD provided snacks of Pongal, kichidi etc. from morning 7 am and sambar rice and curd rice from 11 am till 7 pm besides milk, buttermilk and drinking water during Vahaman Sevas. The display of books, CDs on devotional themes and children’s by the TTD publications wing is a major attraction of the Brahmotsavams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ, విద్యుత్‌ దీపాల శోభతో అలరారుతున్న శ్రీ కల్యాణ వెంకన్న ఆలయం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 27: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు, విద్యుత్‌ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, వాహనమండపంలలో టిటిడి గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దాదాపు 30 మంది సిబ్బంది 2 రోజుల పాటు శ్ర‌మించి సుందరంగా అలంకరించారు. ఇందుకుగాను 5 టన్నుల వివిధరకాల సుగంధ, ఉత్తమజాతి పుష్పాలు ఉపయోగించారు.

అదేవిధంగా టిటిడి విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో విద్యుత్‌ దీపాలంకరణలతో శోభాయమానంగా విరాజిల్లుతుంది. టీటీడీ విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలువురి దేవతా మూర్తుల విద్యుత్‌ దీపాల కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయ.

ఇందులో భాగంగా తిరుపతి – శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి – శ్రీనివాసమంగాపురం రహదారిలో ఎల్‌ఈడి స్వాగత ఆర్చీలు, తోరణలు, వివిధ దేవతామూర్తుల కటౌట్లు, ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ మహావిష్ణువు విశ్వరూపం, దశ అవతారాలు, పద్మావతి అమ్మవారి విద్యుత్‌ దీప కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పుష్కరిణి సమీపంలో అనంత పద్మనాభస్వామి, ఆనంద నిలయంలో శ్రీనివాసుడు, శ్రీ సీతా లక్షణ సమేత కోదండరామస్వామివారి ఎల్‌ఈడి లైట్లతో ఏర్పాటు చేసిన కటౌటు భక్తులను విశేషంగా అకర్షిస్తుంది.

టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం 7.00 గంటలకు పొంగలి, కిచిడి వంటి అల్పహరం, ఉదయం 11.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు భక్తులకు సాంబారు అన్నం, పెరుగన్నం భక్తులకు పంపిణీ చేస్తుంది. వాహన సేవలలో భాగంగా నాలుగు మాడ వీధులలో పాలు, మజ్జిగ, త్రాగు నీరు అందిస్తుంది.

టిటిడి ప్రచురణల విక్రయ విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవాన్నితెలిపే పుస్తకాలతో పాటు అనేక ధార్మిక విషయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలు, పిల్లల నుండి పెద్దల వరకు ఆకట్టుకుంటున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.