FOCUS ON ARCHITECTURE IN TEMPLES- JEO LAKSHMIKANTHAM_ ఆల‌యాల్లో శిల్పాల ప్రాశ‌స్త్యాన్ని తెలిపేలా ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 27 Feb. 19: Tirupati JEO Sri B Lakshmikantham said that the TTD was focusing on display of historic and architecture features of Sri Padmavati Ammavari Temple.

After an inspection tour of Sri Padmavati Ammavari Temple and also Sri Govindaraja Swamy temple along with Sri Vani Mohan, the Commissioner of the AP Archaeology Department on Wednesday, the JEO said that arrangements were being made to highlight the architectural beauty and significance of the local temples on smart phone using latest Augmented Reality Technology (ART) for which the TTD has also conceived a new app for benefit of the devotees. He said TTD master plan also included widening of roads, facilities of toilet, drinking water around the local temples besides extended focus on the historical and mythological legend of the temples for common devotee benefit.

The JEO and the State Archaeology commissioner also went around the Sri Suryanarayanaswami temple, Padma Pushkarini, Padmavati Gardens, Mandapam and other areas. They also went around the Sri Parthasarathi temple, Sri Andal temple and Sri Venkateswara temple within the complex .

Speaking on the occasion the Archaeology Commissioner said that her department was examining the arrangements to be made for maintenance of Kalyana mandapam, Yaga shala where TTD has taken up development works like cell phone keeping centers, parking and garden maintenance.

TTD SE-4 Sri Ramulu , Sp.Gr.Dy.E.O. Smt Varalakshmi, DyEO Smt Jhansi Rani, EEs Sri T V Styanarayana, Sri Manoharam and others also participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఆల‌యాల్లో శిల్పాల ప్రాశ‌స్త్యాన్ని తెలిపేలా ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం

ఫిబ్రవరి 27, తిరుపతి, 2019: తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంతోపాటు ఇత‌ర టిటిడి ఆల‌యాల్లో శిల్పాలు, స్తంభాల‌పై గ‌ల కుడ్య చిత్రాల చారిత్ర‌క‌, పౌరాణిక ప్రాశ‌స్త్యాన్ని భ‌క్తుల‌కు తెలిపేందుకు ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. రాష్ట్ర ఆర్కియాల‌జి విభాగం క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి వాణి మోహ‌న్ తో క‌లిసి బుధ‌వారం జెఈవో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యాల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ శిల్పాలను, కుడ్య చిత్రాల‌ను భ‌క్తులు సెల్‌ఫోన్‌తో స్కాన్ చేసిన‌ట్ల‌యితే సంబంధిత పౌరాణిక, చారిత్ర‌క‌ ప్రాశ‌స్త్యాన్ని తెలిపేలా ఆగుమెంటెడ్ రియాల‌టి టెక్నాల‌జీని వినియోగిస్తామ‌న్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా యాప్‌ను రూపొందిస్తామ‌ని తెలిపారు. 3డి లేజ‌ర్ క‌మ్ ప్రొజెక్ష‌న్ మ్యాపింగ్ ద్వారా ప‌ద్మ‌పుష్క‌రిణిలో అమ్మ‌వారి పురాణ మ‌హిమ‌ను తెలియ‌జేసేలా రూపాలు నీటిలో క‌నిపించేలా చిత్రీక‌రిస్తామ‌న్నారు. అదేవిధంగా, ఆల‌యంలో మౌలిక స‌దుపాయాలు పెంచుతామ‌ని, ఆల‌య ప్రాశ‌స్త్యంపై విస్తృతంగా ప్ర‌చారం చేస్తామ‌ని వివ‌రించారు. మాస్ట‌ర్‌ప్లాన్‌లో భాగంగా రోడ్డు విస్త‌ర‌ణ‌, ర‌థం అభివృద్ధి త‌దిత‌ర ప‌నులను ద‌శ‌ల‌వారీగా చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.

అనంత‌రం శ్రీ సూర్య‌నారాయ‌ణ‌స్వామివారి ఆల‌యం, ప‌ద్మ‌పుష్క‌రిణి, ప‌ద్మావ‌తి ఉద్యాన‌వ‌నంలోని మండ‌పం, కోనేరు త‌దిత‌ర ప్రాంతాల్లో గ‌ల‌ శిల్పాలు, కుడ్య చిత్రాల‌ను జెఈవో ప‌రిశీలించారు. ఆ త‌రువాత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ శ్రీ పార్థ‌సార‌థిస్వామివారి ఆల‌యం, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాలు, మండ‌పాలపై గ‌ల శిల్పాలను, కుడ్య చిత్రాల‌ను ప‌రిశీలించారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో టిటిడి ఎస్ఇ-4 శ్రీ ఎ.రాములు, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఇఇలు శ్రీ టివి.స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ మ‌నోహ‌రం, ఏఈవోలు శ్రీ శ్రీ‌నివాసులు, శ్రీ ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ‌నివాస‌మంగాపురంలో రాష్ట్ర ఆర్కియాల‌జి క‌మిష‌న‌ర్ ప‌రిశీల‌న‌

శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాన్ని బుధ‌వారం రాష్ట్ర ఆర్కియాల‌జి విభాగం క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి వాణి మోహ‌న్ ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌మ‌తి వాణి మోహ‌న్ మాట్లాడుతూ ఆల‌యంలో యాగ‌శాల‌, క‌ల్యాణోత్స‌వ మండం, పాద‌ర‌క్ష‌లు, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంట‌ర్లు, కార్ పార్కింగ్ త‌దిత‌ర అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ఆర్కియాల‌జి స‌ర్వే ఆఫ్ ఇండియా అనుమ‌తుల కోసం ప‌రిశీల‌న చేప‌ట్టామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.