DEEPAVALI ASTHANAM, KOIL ALWAR & SITARAMA KALYANAMS AT SRI KRT_ అక్టోబరు 19న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం, సహస్ర కలశాభిషేకం
Tirupati,9 October 2017: The holy festival of Dipavali Asthanam,will be held at the TTD sub temple of Sri Kodandaram Temple on October 19th, Thursday Amavasvya and Sahasra Dipalankaram as well.
Accordingly interested devotees could participate with a token payment of Rs.500- and beget a prasadam of one Uttariyam, one blouse, one laddu and one vada as well.
On Deepavali day new silks, Deshapadi and deepam will be brought from Sri Govindaraja swamy temple to the deity of Sri Kodandarama Swamy in a procession ahead of Asthanam event.
The Hanumantha Vahanam seva slated for Thursday at the KRT has been cancelled on that day.
KOIL ALWAR AT SRI KRT ON OCT 17
The Koil alwar thirumanjanam will be performed at Sri KRT ahead of Dipavali asthabam.
Sri Sitarama Kalyanam @ Sri KRT on Oct.13th
The celestial event of Sri Sitarama Kalyanam will be grandly organised at the Sri Kodandaram Temple on October, 13th on the ocassion of Punarvasu nakshatram , the birth star of Sri Ramachandra.
Accordingly interested devotees could participate with a token payment of Rs.500- and beget a prasadam of one Uttariyam,one blouse and Anna prasadams. Later in the evening the utsava deities of Sri Rama and his consorts will be taken in a procession on the KRT mada streets and to the Sri Ramachandra Pushkarini where Unjal seva will be performed. TTD has appealed to devotees to come in traditional dress to participate in the Kalyanaotsavam event .
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI
అక్టోబరు 19న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం, సహస్ర కలశాభిషేకం
తిరుపతి, 2017 అక్టోబరు 09: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో అక్టోబరు 19వ తేదీ గురువారం అమావాస్య, దీపావళి సందర్భంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆస్థానం నిర్వహించనున్నారు.
అమావాస్యను పురస్కరించుకుని ఉదయం 6.30 నుండి 8.30 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా జరగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
దీపావళి సందర్భంగా అక్టోబరు 19వ తేదీ రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.
అక్టోబరు 17న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 17వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో అక్టోబరు 19వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
అక్టోబరు 13న శ్రీ సీతారాముల కల్యాణం :
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 13వ తేదీ శుక్రవారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.
శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.