PUSHPA YAGAM AT SRIVARI TEMPLE ON OCT 28_ అక్టోబరు 28న తిరుమలలో పుష్పయాగం

Tirumala, 9, October 2017: TTD plans to conduct Pushpa yagam at Srivari Temple in a grand manner on the occasion of Sravana star (birth star of Lord Venkateswara) during Karthika Masam on October 28.

Accordingly, Ankuraranam will be performed for the event on Oct 27 and the Vasantotsavam and Sahasra Dipalankara sevas scheduled in the Srivari Temple on Oct 28 have been cancelled.

As part of the event, utsava idols of Malayappaswamy will be given Snapana Thirumanjanam at the Kalyana mandapam in the sampangi mandapam on Otober 28 and thereafter Pushpa yagam will commence with flowers and Vahana procession on mada streets after the evening Sahasra deepalankara seva.

The TTD has cancelled the scheduled Kalyanotsavam, Brahmotsavam and Vasatotosavam on the day.

The legends and inscriptions say that Pushpa yagam celestial ritual was performed on the seventh day after annual Brahmotsvam in the 15th century for the peace, prosperity and tranquillity in society.The practice was revived by TTD since 1980.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అక్టోబరు 28న తిరుమలలో పుష్పయాగం

అక్టోబరు 09, తిరుమల, 2017: కార్తీకమాసంలో శ్రవణానక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబరు 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరుగనుంది. అక్టోబరు 27న పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ కారణంగా వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.

అక్టోబరు 28న శ్రీవారి ఆలయంలో రెండవ అర్చన, రెండవ ఘంట, నైవేద్యం అనంతరం శ్రీ భూ సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలకు వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.00 నుంచి 5.00 గంటల వరకు పుష్పయాగం వేడుకగా చేపడతారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది.

కాగా, దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. అంతేగాక అప్పట్లో బ్రహ్మూెత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడవనాడు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. ఆ తరువాత నిలిచిపోయిన ఈ దివ్య పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాస శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.