DHARMA PRACHARAM AT MANDAL LEVEL PROGRAMME_ మండల స్థాయిలో ధర్మప్రచార మండళ్లను బలోపేతం చేయాలి : టిటిడి హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి

Tirupati,9 October 2017: The Hindu Dharma Prachara Parishad, the religious wing of TTD aims to expand its activities from mandal level in every state, says Sri A Ramakrishna Reddy ,the HDPP secretary.

Addressing the HDPP members session at the SVETA this morning he said the campaign for promoting sanatana Hindu dharma from mandal level will begin on a pilot basis will be taken up in seven districts of Chittoor,Krishna,Vizianagaram,Kadapa and Nellore in AP and Warangal and Mahbobnagar in Telangana.

Speaking on ocassion the HDPP project officer Dr R Ramanaprasad said that action plan be prepared for HDPP activities at grass root level. He reviewed the activities taken up so far and also plan of action for strengthening the bhajan mandalis and activities during the Karthika masam.

Among others Sri Nageswar Rao, AEO,Supdt. Sri Gurnath,Sri Satya and members of HDPP from Telangana,Kerala, Tamilnadu and Karnataka participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

మండల స్థాయిలో ధర్మప్రచార మండళ్లను బలోపేతం చేయాలి : టిటిడి హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి

అక్టోబరు 09, తిరుపతి, 2017: సనాతన ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా ధర్మప్రచార మండళ్లను మండల స్థాయిలో బలోపేతం చేయాలని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీఎ.రామకృష్ణారెడ్డి కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం ఉదయం హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లా ధర్మప్రచార మండలి సభ్యుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడతలో ఎంపిక చేసిన 7 జిల్లాల్లో మండలస్థాయిలో ధర్మప్రచార మండలి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

హెచ్‌డిపిపి ప్రాజెక్టు అధికారి డా|| ఆర్‌.రమణప్రసాద్‌ మాట్లాడుతూ ధర్మప్రచార పరిషత్‌ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద మొదటి విడతలో ఎంపికచేసిన 7 జిల్లాల్లో చిత్తూరు, కృష్ణా, విజయనగరం, కడప, నెల్లూరు, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాల్లో మండలస్థాయిలో వీలైనన్ని ఎక్కువ ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆయా జిల్లాల్లో ధర్మప్రచార మండళ్ల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలయ్యాయని ధర్మప్రచార మండలి సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో చేపట్టనున్న కార్తీకమాస ఉత్సవాలు, భజన మండళ్ల పటిష్టత తదితర కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో హెచ్‌డిపిపి ఏఈవో శ్రీ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు శ్రీగుర్నాథ్‌, శ్రీసత్య, ఎపి, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ధర్మప్రచార మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.