DEEPAVALI ASTHANAM ON OCT 19_ శ్రీవారి ఆలయంలో అక్టోబరు 19న దీపావళి ఆస్థానం

Tirumala, 5 October 2017: Every year the Deepavali Asthanam is held at Srivari Temple on Amavasya day of Ashviyuja month on Ocrober 19.

As a result of the celestial event is organised at the Bangaru Vakili in the sanctum all the arjita sevas like Kalyanotsavam, Tiruppavada seva, Unjal seva, Arjita Brahmotsavam and Vasantatotsavam were cancelled. However the Tomala and Archana sevas are performed in Ekantha seva only while the arjita Suprabatham and Sahasra Deepalankara seva are performed as usual.

Deepavali Asthanam is an event where the utsava idol of Sri Malayappaswamy along other dieties seated in the Sarva bhoopala vahanam along with garuda near the Bangaru vakili for special rituals, harati and prasadams.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

శ్రీవారి ఆలయంలో అక్టోబరు 19న దీపావళి ఆస్థానం

అక్టోబరు 05, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 19వ తేదీనాడు ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య (దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు జరుగుతాయి.

అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది. అయితే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక సుప్రభాతం మరియు సహస్రదీపాలంకార సేవలకు యథావిధిగా గ హస్థ భక్తులను అనుమతిస్తారు.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలోనికి వస్తారు. ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారులకు అభిముఖంగా ఏర్పాటు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.