TIRUMALA TEMPLE IS A SYMBOL OF ONENESS OF INDIA-CENTRAL MINISTER _ స్వచ్ఛతకు ప్రతీక తిరుమల : కేంద్ర రైల్వే మంత్రి గౌ|| శ్రీ పియూష్‌ గోయల్‌

Tirumala, 15 Jun 18: Describing the Hill shrine of Lord Venkateswara as the “Temple of Oneness and Unity of India, the Union Minister for Railways and Coal Sri Piyush Goyal complimented the temple administration for maintaining orderliness in pilgrim crowd management.

The Hounourable union minister had darshan of Lord Venkateswara on Friday. After the Vedasirvachanam in Ranganayakula Mandapam, Tirumala JEO Sri K S Sreenivasa Raju offered him Teertha, Prasadams and lamination photo of Lord Venkateswara.

Speaking to media persons outside the temple, the honourable Minister said, the darshan of Lord Venkateswara is very enlightening and reinforces his commitment to discharge his duties with more enthusiasm. The way in which the temple is being managed, temple board, the temple management, the swachta of temple, performance of pujas by priests and the orderly behaviour of every pilgrim makes this temple unique among all in the country”, he added.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్వచ్ఛతకు ప్రతీక తిరుమల : కేంద్ర రైల్వే మంత్రి గౌ|| శ్రీ పియూష్‌ గోయల్‌

జూన్‌ 15, తిరుమల 2018: ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల స్వచ్ఛతకు ప్రతీక అని, ఇతర ఆలయాన్నింటికీ ఇది ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర రైల్వే, బొగ్గుగనుల శాఖ మంత్రి గౌ|| శ్రీ పియూష్‌ గోయల్‌ కొనియాడారు. గౌ|| కేంద్ర మంత్రి శుక్రవారం ఉదయం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అనంతరం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కేంద్రమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.

అనంతరం ఆలయం వెలుపల గౌ|| శ్రీ పియూష్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనంతో దివ్యానుభూతి కలిగిందని, శ్రీవారి ఆశీస్సులతో మరింత అంకితభావంతో దేశప్రజలకు సేవలందిస్తానని తెలిపారు. శ్రీవారి ఆలయం ఏకత్వానికి చిహ్నంగా నిలుస్తోందన్నారు. ఆలయ నిర్వహణ చక్కగా ఉందని, భక్తులందరికీ అద్భుతమైన సేవలందుతున్నాయని అన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి, సమర్థవంతమైన అధికారులు, అనుభవం గల అర్చకులు, క్రమశిక్షణ గల భక్తులతో ఈ ఆలయం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోందన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.