V DAY SATISFACTORY DARSHAN TO COMMON DEVOTESS – TTD EO _ వైకుంఠ ఏకాదశి నాడు సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం ; శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీని పర్యవేక్షించిన ఈవో

EO SUPERVISES CROWD MOVEMENT _SRIVARI TEMPLE

DEVOTEES HAPPY ON TTD FACILITATION

Tirumala, 29 December 2017:TTD executive officer, Sri Anil Kumar Singhal said that the devotees were given satisfactory and comfortable darshan on Vaikunta Ekadasi today.Speaking to reporters outside the Srivari Temple Sri Singhal said that Sarva darshan for common devotees commenced from 8.05 hours this morning and the devotees had patentily waited for 30 hours in the qlines since yesterday in the VQC compartments,outside queuelines etc.

He said TTD had made elbaorate arrangements to provide them coffee ,tea, anna prasadams and drinking water inside the queuelines .Special bhajan programs were also organised by the HDPP to whip up the devotional quotient among the devotees waiting in the queuelines .Similarly FM Radio and Broadacasting services were deployed to give information on accomdation ,darshan hours to devotees frequently .Mobile toilets were also pressed into service to meet the challenges of nature .

He said additional dispensaries were set up to provide first aid and emergency medicare to devotees with a 70 member para medical staff.Nearly 3500 Srivari Sevakas served the devotees all over Tirumala and Tirupati. ‘Devotees were happy with all services provided by the TTD’ the EO said after interaction with devotees within the temple and also outside in the queue lines.

The electrical lighting,scented flower decorations from Mahadwaram to Dwajasthambham captivated the devotees with Vaikuntam experience.

Chakrasnanam on December 30, VaikunTa Dwadasi .

On the ocassion of the Vaikunta Dwadasi on December 30 ,the TTD plans to perform the Chakrasnanam for the Sri Sudarshan Chakrathalwar in the early hours of 4.30 -5.30 AM. Legends say that devotees who take part in Chakrasnanam at the alloted muhurtam would beget 66 crores worth holy bating in the holy thirthams .

The TTD has cancelled all the Arjia sevas on Vaikunta Dwadasi day as well .


ISSUED BY PUBLIC RELATIONS OFFIER,TTDs,TIRUPATI

వైకుంఠ ఏకాదశి నాడు సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం ; శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీని పర్యవేక్షించిన ఈవో

టిటిడి సౌకర్యాలపై సంతోషం వ్యక్తపరిచిన భక్తులు

డిసెంబరు 29, తిరుమల 2017తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించినట్లు తి.తి.దే ఈ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8.05 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభించినట్లు తెలిపారు. క్యూలైన్లలో దాదాపు 30 గంటల పాటు వేచివున్న భక్తులు సంయమనంతో వ్యవహరించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కంపార్టుమెంట్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు పంపిణీ చేశామన్నారు. భక్తులకు ఆధ్యాత్మికానందం కల్పించేందుకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి దర్శనానికి పట్టే సమయం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్ల వివరాలు, భక్తులకు అందిస్తున్న వసతులను ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నామన్నారు. భక్తుల కోసం అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటుచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసి 70 మంది వైద్యసిబ్బంది ద్వారా భక్తులకు వైద్యసేవలు, అవసరమైన మందులు అందిస్తునట్లు తెలిపారు. 3500 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీటి పంపిణీ తదితర సేవలందిస్తున్నారన్నారు. టి.టి.డి అందించిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈ.ఓ తెలిపారు.

కాగా, శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో అలంకరించారు.

డిసెంబరు 30న వైకుంఠ ద్వాదశి నాడు చక్రస్నానం :

డిసెంబరు 30వ తారీఖున వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నానమహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. కాగా వైకుంఠద్వాదశినాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను తితిదే రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.