LORD MALAYAPPA BLESSES DEVOTEES ON FINAL HORSE CARRIER_ అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

Tirumala, 30 September 2017: After riding and blessings devotees on 15 different carriers in the last one week, Lord Malayappa Swamy takes pleasant ride on the final carrier on eighth day evening on Aswa Vahanam on Saturday.

The Ashwa Vahanam procession denotes one of his most popular and well received avatars Kalki – a Good Samaritan who fights the evil and protects the righteous people and ensures good things in the Kaliyuga.

The Kalki avatar of Lord Venkateswara is hailed as the most significant in the celestial lores of Malayappa Swamy.

The Aswa Vahanam of Lord Venkateswara sends message to everyone to keep away from Kali-dosha and continuously pray and sing the keertans of lord to wardoff the impact of wrong doings.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

తిరుమల, 30 సెప్టెంబరు 2017: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు శనివారం రాత్రి 9.00 నుండి 11.00 గంటల నడుమ శ్రీమలయప్పస్వామి వారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు.

ఎనిమిదవరోజు రాత్రి స్వామివారు అశ్వంపై కూర్చొని, తనవేగశక్తినీ, బలశక్తినీ నిరూపిస్తుంటారు. వేగశక్తి అశ్వలక్షణం. సృష్టిలో యజ్ఞం తర్వాత పుట్టిన జీవి గుర్రమే! తర్వాతనే ఆవులూ, మేకలూ మున్నగు జంతువులు రూపొందాయి. ప్రయాణసాధనాల్లో మునుపు అశ్వానిదే అగ్రస్థానం. ఇప్పటికీ ఒకయంత్రంశక్తిని ‘హార్స్‌పవర్‌’ అనే పేరుతో గణించడం మనకు తెలుసు. రథాన్ని లాగేవి గుర్రాలే! యుద్ధాలలో ఆశ్వికదళం అధికంగా ఉంటుంది.

శ్రీహరి శ్రీనివాసుడై ఈలోకంలో వేంకటాచలం చేరి, అటనుండి పద్మావతీదేవిని పెండ్లాడడానికై మొట్టమొదట వేటనెపంతో గుర్రంపైన్నే వచ్చాడు. ఆ గుర్రమే తనకు వివాహవాతావరణాన్ని కల్పించడంలో ప్రముఖసాధనమైంది. శ్రీహరి యొక్క జ్ఞానావతారాల్లో మొదటిది హయగ్రీవావతారమే! అంటే గుర్రంముఖం కల్గినమూర్తి. హయగ్రీవుడు విద్యాధిదేవత. ఈకారణాలవల్లనూ స్వామికి బ్రహోత్సవవాహనసేవల్లో మొదట పెద్దశేషవాహనం కుండలినీ యోగానికి సంకేతమైతే – చివర అశ్వవాహనం ఓంకారానికి సంకేతమై – కుండలినీ యోగంతో ప్రణవాన్ని (ఓంకారాన్ని) చేరి, ఆనందించే తత్త్వాన్ని ఆద్యంత ఉత్సవాలు నిరూపిస్తున్నాయి. చక్కని సమన్వయాన్ని కల్గిస్తున్నాయి.

ఇంతేకాక ఈ కలియుగాంతంలో స్వామి కల్కిమూర్తియై గుర్రంపై పయనిస్తూ – ఖడ్గధారియై దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. కనుక ఈ అశ్వవాహనత్వం కల్కి అవతారాన్ని గుర్తుచేస్తూంది. ఇంద్రునికి ఏనుగుతోపాటు గుర్రం కూడా వాహనంగా ఉంది. ఆధ్యాత్మికంగా పరమాత్మే అశ్వం. ఆయనే మనహృదయంలోఉండి, ఇంద్రియాల్ని నియమిస్తున్నాడు.


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.