DEVOTIONAL BOOKS RELEASED_ చిన్న‌శేష‌ వాహ‌నసేవ‌లో మూడు ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ

Srinivasa Mangapuram, 25 Feb. 19: Three devotional books were released during Chinna Sesha Vahana seva in Srinivasa Mangapuram brahmotsavams on Monday.

Sakshatkara Vaibhavam, Srimad Ramayanasaramritam in Tamil, Keechakavadha books were released by temple DyEO Sri Dhananjeyulu in front of this vahanam.

Publications wing special officer Dr T Anjaneyulu, Sub-Editor Sri N Narasimhacharya and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చిన్న‌శేష‌ వాహ‌నసేవ‌లో మూడు ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ

తిరుప‌తి, 2019 ఫిబ్ర‌వ‌రి 25: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం ఉదయం చిన్నశేషవాహనంపై పండ‌రీపురం పాండురంగ‌స్వామివారి అలంకారంలో స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సంద‌ర్భంగా టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ఆధ్వ‌ర్యంలో ముద్రించిన సాక్షాత్కార వైభవం, శ్రీమద్రామాయణ సారామృతం (తమిళం), కీచక వధ పుస్త‌కాల‌ను టిటిడి స్థానిక ఆల‌యాల డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు ఆవిష్క‌రించారు. అనంత‌రం రచ‌యిత‌ల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.. తాళ్లూరు ఆంజ‌నేయులు, ఉప‌సంపాద‌కుడు డా.. నొస్సం న‌ర‌సింహాచార్య పాల్గొన్నారు.

సాక్షాత్కార వైభవం అనే పుస్త‌కాన్ని డా.. మేడ‌సాని మోహ‌న్ ర‌చించారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎంత ప్రాచీనమైనదో శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణవేంకటేశ్వర సామి వారి ఆలయం కూడా అంతే ప్రాచీనమైనదని పెద్దలు చెబుతారు. తిరుమలలో వలే స్వామివారు ఇక్కడకూడా స్వయంభువుగా వెలిశారు. నారాయణ వరంలో పద్మావతి అమ్మవారిని వివాహమాడి తిరుమలకు వెళుతూ స్వామివారు ఇక్కడ ఆరుమాసాలపాటు విడిది చేశారని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయం చారిత్రకంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తి.తి.దే పరిధిలోనికి రావడం వంటి అంశాలపట్ల భక్తలోకానికి సదవగాహన కల్పించే ప్రయత్నానికి అక్షరరూపాన్ని కల్పిస్తే అదే సాక్షాత్కార వైభవ గ్రంథం.

శ్రీమద్రామాయణ సారామృతం (త‌మిళం) అనే పుస్త‌కాన్నిడా|| పి. హరికేశవన్ ర‌చించారు. సనాతన హైందవ సంప్రదాయానికి రామాయణ భారత భాగవతాలు మూలాలు.రామాయణం అంటే రాముని అయనం. సాక్షాత్తు భగవంతుడే ఒక మానవునిగా అవతరించి సుఖదు:ఖాలను అనుభవిస్తూ ఒక ఆదర్శవంతమైన కుమారునిగా, ఒక ప్రభువుగా, ఒక సోదరునిగా, ఒక భర్తగా, ఒక స్నేహితునిగా ఒక పితృవాక్యపాలకునిగా తాను తన ధర్మాలను ఆచరించి ఈ లోకానికే ఆదర్శవంతమైన ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని పయనమే శ్రీమద్రామాయణం. ఏతత్‌ గ్రంథకర్త ‘ఆదికవి వాల్మీకి’. వాల్మీకి రామాయణం ఆధారంగా అనేక మంది కవులు అనేక ప్రాంతీయ భాషలలో రామాయణాన్ని వ్రాసుకున్నారు. ఇలా వచ్చిందే తమిళంలో కంబ రామాయణం.

‘శ్రీమద్రామాయణ సారామృతము’ అను గ్రంథం వాల్మీకి రామాయణాన్ని, తమిళ కంబ రామాయణాన్ని ఆధారం చేసుకొని సరళమైన భాషలో తమిళంలో వ్రాశారు.

కీచక వధ (భారత ఉపాఖ్యాన గ్రంథమాల) మహాభారత విరాట పర్వంలోని ”కీచకవధ” అనే ఈ కథాంశానికి డా||ఆర్‌ అనంతపద్మనాభరావు గారు వ్యాఖ్యానాన్ని అందించగా డా|| జి.దామోదరనాయుడు గారు పీఠికను సంతరించారు. పాండవులు అజ్ఞాతవాసంలో భాగంగా మారుపేర్లతో మారు వేశాలు ధరించి విరటునికొలువులో వివిధ పనులలో చేరడం. సైరంధ్రి అనే పేరుతో చేరిన ద్రౌపదిని కీచకడు చెరబట్ట ప్రయత్నించడం భీముడు స్త్రీవేశధారియై కీచకుని వధించడం మొదలైన ఘట్టాలతో కూడిన కథాంశమే ఈ కీచక వధ.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.