DEVOTIONAL MUSIC AND DANCE PROGRAMMES ENTRALL DEVORTEES IN TIRUPATI _ తిరుపతిలో భక్తిభావాన్ని పంచిన ఆధ్యాత్మిక సంగీత, నృత్య కార్యక్రమాలు
Tirupati, October 18, 2026: As part of the seventh day of the Srivari Salakatla Brahmotsavams, devotional music, dance and cultural programmes held in Tirupati on Sunday attracted devotees.
At Mahati Kalakshetram, the instrumental music performance by the team of V.L. Kumar, an alumnus of SV College of Music and Dance, was followed by a Bharatanatyam performance by the teams of G. Goutham and C.H. Jagadeesh.
At Annamacharya Kalamandiram, K. Shanthi Chandrika’s team from Hyderabad presented devotional music, followed by a Kuchipudi dance performance by M.V.N.S. Durga’s team from Tirupati.
At the Sri Kodandaramaswamy Temple Pushkarini, P. Bindusree’s team enthralled the audience with a traditional Burrakatha performance.
Devotees and art lovers attended the programmes in large numbers and enjoyed the spiritual and cultural performances.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుపతిలో భక్తిభావాన్ని పంచిన ఆధ్యాత్మిక సంగీత, నృత్య కార్యక్రమాలు
మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, కోదండరామాలయం పుష్కరిణిలో అలరించిన కళాకారులు
తిరుపతి, 2026 అక్టోబరు 18: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం తిరుపతిలో నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సంగీతం, నృత్యం, బుర్రకథ ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.
మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ వి.ఎల్. కుమార్ బృందం వాద్య సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం శ్రీ జి. గౌతమ్, శ్రీ సి.హెచ్. జగదీష్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను అలరించింది.
అన్నమాచార్య కళామందిరంలో హైదరాబాద్కు చెందిన శ్రీమతి కె. శాంతి చంద్రిక బృందం భక్తి సంగీత కార్యక్రమం భక్తులను భక్తిభావంలో ముంచెత్తింది. అనంతరం తిరుపతికి చెందిన శ్రీమతి ఎం.వి.ఎన్.ఎస్. దుర్గ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది.
శ్రీ కోదండరామాలయ పుష్కరిణి వద్ద శ్రీమతి పి. బిందుశ్రీ బృందం ప్రదర్శించిన బుర్రకథ భక్తులను అలరించింది.
ఈ కార్యక్రమాలను సంగీత, నృత్యాభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించి ఆనందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.






