DHWAJAROHANAM OF NARAYANAVANAM K V TEMPLE BTU_ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
Narayanavanam, 27 May 2018: The Annual Brahmotsavam of Sri Kalyana Venkteswara Swamy of Narayanavanam kicked off with Dwajarohanam on Sunday morning. All the celestial group of Gods were invited traditionally for the event with special rituals. The vedic priests performed Bheri Thandavam, Bheri Puja, Dhwajapatam, Navasandhi, Srivari Mada Veedhi utsavam and Asthanam.
Later in the afternoon Snapana Tirumanjanam was performed for the utsava idols of Lord and his consorts with milk, curd, honey, turmeric, fruit juices and sandal paste, Unjal seva will be performed in the evening and the first big event of Pedda Shesha vahanam in the night.
DURING THE NINE DAY FESTIVAL
Chinna sesha vahanam ad Hamsa vahanam (on Monday May 28)
Simha vahanam and Muthyapu pandiri vahanam (on Tuesday, May 30)
Kalpavruksa and Sarva Bhoopala vahanam (Wednesday, May 30)
Pallaki utsavam (Mohini) and Garuda vahanam (Wednesday, May 31)
Hanumantha Vahanam and Gaja Vahanam (Thursday, June 1)
Suryaprabha and Chandraprabha Vahanam (June 2)
Rathotsavam and Kalyanotsavam, Ashwa vahanam (June 3)
Chakrasnanam and Dwaja Avarohanam (June 4).
Cultural programs like bhakti sangeet and religious discourses will be conducted under the aegis of HDPP and Annamacharya project every day in the evening in the temple premises.
Local temples Dy EO Smt Jhansi, AEO Sri Thirumalaiah, Supdt Sri Chandra mouleswara sharma and TTD officials and others participated in the event
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2018 మే 27: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 9.00 గంటల మద్య మిధునలగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు.
అనంతరం ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేపట్టారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో మొదటిదైన పెద్దశేష వాహన సేవ రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది.
బ్ర్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
27-05-2018(ఆదివారం) ధ్వజారోహణం (మిధునలగ్నం) పెద్దశేష వాహనం
28-05-2018(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
29-05-2018(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
30-05-2018(బుధవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
31-05-2018(గురువారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
01-06-2018(శుక్రవారం) హనుమంత వాహనం గజ వాహనం
02-06-2018(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-06-2018(ఆదివారం) రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం
04-06-2018(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు అధ్వార్యంలో ప్రతి రోజు సాయంకాలం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీ,ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్ శ్రీ చంద్రమౌళిశ్వరశర్మ, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.